Breaking News

స్పందనలలో 26 అర్జీల రాక – ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, నిర్వహించారు. ప్రజలు ఎదుర్కోను సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమస్య పునరావృతం కాకుండా వేగవంతముగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమములో ప్రధానంగా పట్టణ ప్రణాళిక – 12, ఇంజనీరింగ్ – 4, పబ్లిక్ హెల్త్ విభాగం –2, ఎస్టేట్ విభాగం – 1, యు.సి.డి – 1, రెవిన్యూ – 5, జోనల్ కమీషనర్ – 1 అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎస్టేట్ అధికారి కె.అంబేద్కర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *