Breaking News

దేశానికి జాతీయ జెండా ఉండాలనే ఆవశ్యకతను బలంగా చాటిచెప్పారు…. : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 146 వ జయంతిని పాల ఫ్యాక్టరీ ఎదురుగా గల వెంకయ్య విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ , అనంతరం మహేష్ మాట్లాడుతూ, జాతీయ జెండా దేశానికి గర్వకారణమని, మువ్వన్నెల జాతీయ పతాకం ఎగురుతుంటే ప్రతి భారతీయుడు శరీరం పులకిస్తుందని, అచ్చ తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య కృష్ణా జిల్లా లో జన్మించటం మనందరికీ గర్వకారణం అని, దేశానికి జాతీయ జెండా ఉండాలనే ఆవశ్యకతను బలంగా చాటిచెప్పారని, స్వాతంత్రోద్యమంలో దేశ ప్రజల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు మువ్వన్నెల పతాకం ఒక ప్రధాన కారణమని , అందుకోసం విశేషంగా కృషి చేసిన వెంకయ్య గారిని దేశ ప్రజలు ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారన్నారు. దేశ రాజకీయాల్లో పార్టీ జెండా కన్నా ముందు జాతీయ జెండా పట్టుకుని భారీ బహిరంగ సభల్లో సైతం పాల్గొనే గొప్ప జాతీయవాది భారతీయుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్ భాషా, షేక్ షర్మిల ,సుంకర.ప్రేమ్ కుమార్, స్టాలిన్  శంకర్, పొట్నూరి.శ్రీను, రెడ్డిపల్లీ.గంగ, నల్లబెల్లి.కనకరావు, బొబ్బూరి.కొండ, నరేష్, శ్రీను, శివ, దుర్గారావు, సోమశేకర్, కూర్మరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *