-ఆయా రంగాల్లో వారిని మరింత ఆర్థిక బలోపేతం దిశగా సిఎం ఆలోచన
-కలెక్టర్ కె.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న తోడు ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్న లబ్దిదారులు ఆ రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా పూర్తి వడ్డీ మాఫీకి అర్హత సాధించగలుగుతారని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవిలత అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న తోడు’ ఐదవ విడత కింద వడ్డీ రాయితి నగదును బటన్ నొక్కి లబ్దిదారుల అకౌంట్లలో జమ చేశారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత, మున్సిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్, రుడా చైర్మన్ షర్మిలారెడ్డి విసి కి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా.కె.మాధవిలత మాట్లాడుతూ, జిల్లాలో జగనన్న తోడు పథకం క్రింద జిల్లాలో 17902 మంది లబ్ధిదారులకు రు.1790.20 లక్షల రూపాయలు వారి బాంక్ ఖాతాల్లో జమ చేశామన్నారు. తద్వారా జిల్లా పరిధిలోని
చిరు వ్యాపారుల, సాంప్రదాయ వృత్తిదారులైన లబ్ధిదారులకు వారు చెల్లించిన వడ్డీని నేరుగా వారి ఖాతాలోకి జమచెయ్యడం జరిగిందన్నారు. జగనన్న తోడు పథకం అమలు జరిగిన నాటి నుంచి నేటి వరకూ 5 విడతలుగా వారు సక్రమంగా చెల్లించిన వడ్డీని పూర్తిగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు జమచెయ్యడం జరిగిందన్నారు. ఈరోజు 5 వ విడతలో బటన్ నొక్కండం ద్వారా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వడ్డీ మొత్తం జమచేసరని పేర్కొన్నారు. జిల్లాలో ప్రయోజనం పొందిన వారిలో రూరల్ ప్రాంతంలోని 12193 మంది కి రు.1219.30 లక్షలు, అర్బన్ ప్రాంతంలోని 5709 మందికి రు.570.90 లక్షలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో మే, 2022 వరకు సకాలంలో రుణం చెల్లించిన 39487 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.59.98 లక్షల వడ్డీని రీయింబర్స్ చేస్తూ చెల్లించిందన్నారు.
చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం వడ్డీ లేకుండా వారికి రూ.10 వేలు అందిస్తోందని చిరు వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మొత్తాన్ని మరింతగా పెంచే విధంగా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ, సక్రమంగా చెల్లించిన వారికి ప్రతి ఏడాది వెయ్య రూపాయలు చొప్పున పెంచే విధంగా అడుగులు వేయడం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడం తో పాటు అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు. తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తుంటే మళ్లీ రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు.
రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ నిరుపేదలైన చిరు వ్యాపారులు, సాంప్రదాయ వృత్తి వ్యాపారులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధి లక్ష్యంగా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించిందన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. ఈపథకం ప్రయోజనం పొందుతున్న వారిలో 80 శాతం మంది మహిళలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లకు చెందిన వారు ఉండడం గమనార్హం అన్నారు.
జిల్లాలో జగనన్న తోడు నియోజకవర్గాల వారిగా..
అనపర్తి.. 1179 మంది లబ్ధిదారులకు రు.117.90 లక్షలు,
గోపాలపురం.. 1958 మంది లబ్ధిదారులకు రు.195.80 లక్షలు,
జగ్గంపేట (గోకవరం మండలం).. 614 మంది లబ్ధిదారులకు రు.61.40 లక్షలు,
కొవ్వూరు.. 2837 మంది లబ్ధిదారులకు రు..287.70 లక్షలు,
నిడదవోలు.. 1944 మంది లబ్ధిదారులకు రు.194.40 లక్షలు,
రాజమహేంద్రవరం (రూరల్).. 1509 మంది లబ్ధిదారులకు రు.150.90 లక్షలు,
రాజమహేంద్రవరం (అర్బన్).. 4848 మంది లబ్ధిదారులకు రు.484.80 లక్షలు,
రాజనాగరం.. 3013 మంది లబ్ధిదారులకు రు.301.30 లక్షలు,
మొత్తం జిల్లాలో 17902 మంది లబ్ధిదారులకు రు.1790.20 లక్షల రూపాయలు వారి బాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్, రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్, డిఆర్ డిఏ పిడి ఎస్. డేగలయ్య, డిపిఎంలు ఎం. సంపత్ కుమార్, జనార్ధనరావు, హేమంత్, మెప్మా సీఎంఎం పి. రవిశంకర్, కె. మోహన్ కుమార్ ,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News