Breaking News

గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నుండి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే జాతీయ రహదారి నిర్మాణానికి రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ రైతులను కోరారు. విజయవాడ నుండి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, అభ్యంతరాలపై జి కొండూరు మండలం కవులూరు గ్రామ రైతులతో బుధవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, కవులూరు గ్రామ రైతులు, రెవెన్యూ, నేషనల్ హైవే, జల వనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ నుండి ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా కవులూరు గ్రామ రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని వారికి ఎటువంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా గ్రామ రైతులు వారికి కావలసిన సర్వీస్ రోడ్లు, అండర్ పాస్ లు కచ్చా రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక వసతులను కల్పించేందుకు జాతీయ రహదారుల సంస్థ, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు అభ్యంతరాలు చెబుతున్న ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికను సమర్పించాలని జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రైతులు కూడా ప్రభుత్వానికి సహకరించి జాతీయ రహదారి నిర్మాణానికి సహకరించాలని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ కోరారు. సమావేశంలో డిఆర్ఓ కె. మోహన్ కుమార్, నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ వి దుర్గాప్రసాద్, ఇరిగేషన్ ఎస్ ఇ ఎస్. తిరుమలరావు, కవులూరు గ్రామ రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *