Breaking News

రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత జగనన్నదే:దేవినేని అవినాష్

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నివసించే వేలాది కుటుంబాల కష్టాలు తొలగేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసి వారి నాలుగు దశాబ్దాల చిరకాల స్వప్నం సాకారం చేసిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం రాణిగారి తోట వారధి వద్ద గల రిటైనింగ్ వాల్ శంకుస్థాపన స్థూపం వద్ద ముంపు ప్రాంతావాసులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఏర్పాటు చేసిన జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ తన సుదీర్ఘ పాదయాత్ర లో వరద ముంపువాసుల కష్టాలను స్వయంగా చూసిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణినికి 125 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి గొప్ప మనసు చాటుకొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లా హామీ ఇచ్చి గాలికొదిలేయకుండా ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయడంతో పాటు వెనువెంటనే పనులు మొదలయ్యేలా శంకుస్థాపన చేసి చెప్పిన గడువు కంటే ఆరు నెలల ముందుగానే నిర్మాణం పూర్తి అయ్యి ప్రజలలో కళ్ళలో ఆనందం నింపింది అంటే అది జగనన్న కృషి వల్లనే అని అవినాష్ కొనియాడారు. ఈ వాల్ పూర్తి అవ్వడం వలన మా తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వర నగర్, భుపేష్ గుప్తా నగర్, కరకట్ట ప్రాంతావాసుల ఇబ్బందులు తొలగి ఆనందంగా గుండెల మీద చెయ్యేసి పడుకొంటారని అన్నారు.అప్పటి టీడీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిటైనింగ్ వాల్ పేరుతో నిధులు స్వాహా చేసి వారి బినామీ లతో నిర్మించిన నాసిరకం రిటైనింగ్ వాల్ వలన వరద ముంపు తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయ్యింది అని,వందలాది ఇళ్లను తొలగించేలా వారు ప్రణాళికలు సిద్ధం చేసారని విమర్శించారు. కానీ జగన్ గారు ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా కేవలం నిర్మాణప్రాంతంలో నివసించే వారి ఇళ్లను తొలగించి, వారికి అన్ని సౌకర్యాలతో మరోచోట ఉచితంగా ఇళ్ళని కేటాయించి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నే విజయవాడ నగర అభివృద్ధి వేగవంతం అయ్యింది అని,జగన్ గారి కృషి తో రిటైనింగ్ వాల్ తో పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగేలా కనకదుర్గమ్మ వారధి,బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్,సుందరికరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని అవినాష్ చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఒకవైపు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ మరోవైపు అభివృద్ధి లో రాష్ట్రన్ని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, వివిధ, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు, ఇన్ ఛార్జీలు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *