Breaking News

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమమే లక్ష్యం గా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ నందు పోస్టాఫీస్ రోడ్, ఆనంద్ భవన్ రోడ్ ప్రాంతాల్లో ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పట్ల ప్రేమ,తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టాలను చూసి చలించి తయారుచేసిన మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలు అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలో మిగతా ముఖ్యమంత్రి లకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.విజయవాడ నగర అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టీ వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిన ఘనత జగన్ దే అని అన్నారు.తన పాదయాత్ర వారధి మీదుగా సాగినప్పుడు వరద ముంపు ప్రాంత వాసుల కష్టాలను కళ్లారా చూసిన జగన్  అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్ నిర్మించారని,అదేవిధంగా దానిని క్రిష్ణలంక వరకు పొడిగిస్తూ మరో 135 కోట్ల రూపాయలు మంజూరు చేసారని అవినాష్ తెలిపారు. ప్రభుత్వం ఈ విధంగా సంక్షేమం, అభివృద్ధి కి సమ ప్రాధాన్యత ఇస్తూ జనరంజకంగా పరిపాలన సాగిస్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష తెలుగుదేశం అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి అని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రజా సమస్యల గురుంచి పట్టించుకొన్నార అని ప్రశ్నించారు. వచ్చామా షో చేసామా ఫోటో దిగి పేపర్ లో వేయించుకొన్నామా అన్నట్టు గద్దె వ్యవహరించేవారని అవినాష్ ఎద్దేవా చేశారు. పేదవారికి కూడా కార్పొరేట్ విద్య,వైద్యం అందిస్తూ జగన్ వారి గుండెల్లో దేవుడైనడని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డి, ఫజులుద్దీన్, ప్రభాకర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *