విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుప్పంలో జరిగిన సంఘటనకై నారా చంద్రబాబునాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా తన నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి పర్యటనగా వెళితే వైయస్సార్ పార్టీ గూండాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ భరత్ చేసిన అరాచకాలకు తెలుగుదేశం పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు తీవ్రంగా ఖండించారు. శనివారం కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనలు పూర్తిగా శాంతి భద్రతలు తప్పి మానభంగాలు హత్యలు దోపిడీలు, భూకబ్జాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ రౌడీ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వైయస్సార్ పార్టీ చొక్కా ధరించుకొని ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News