-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)లకు నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపు పూర్తి స్థాయిలో చేయడం జరిగిందని, ఆటోమెటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్(ఎయంసియు) నిర్మాణాలకు అవసరమైన భూముల కేటాయింపును వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఏపి డైరీ డెవలప్‌మెంట్ కో`ఆపరేటివ్ పెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపి అమూల్ ప్రోజెక్టు స్పెషల్ ఆఫీసర్ బాబు ఏ కు వివరించారు. ఏపిడిడిసిఎఫ్‌యం డైరెక్టర్ బాబు ఏ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఎస్ డిల్లీరావు, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్ వీడియెకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 112 బల్క్‌మిల్క్ కూలింగ్ యూనిట్(బియంసియు)కు గాను వాటికి పూర్తి స్థాయిలో భూములు కేటాయింపు జరిగి జిల్లా ప్రధమ స్థానంలో ఉన్నాదన్నారు. 264 ఎయంసియు కేంద్రాలకు గాను 252 పూర్తి కాగా మిగిలినవి 12 ఉన్నాయన్నారు.
అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఏయంసియుల భూ కేటాయింపుల కార్యక్రమంలో క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర టెలీకాన్ఫరెన్స్ సమీక్షా జరపాలని వార్డు సెక్రటరీలు, ప్రామోటర్స్, వాలంటీర్లను భాగస్వామ్యులుగా చేసి వారం రోజులలో పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Prajavartha Online Telugu News