విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో మిగతా ముఖ్యమంత్రి లకు ఆదర్శంగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 22వ డివిజన్ 112 వ సచివాలయ పరిధిలోని అన్నమ్మతల్లి గుడి రోడ్ నుండి ఇంటింటికి పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ద్వారా వారి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాలను కరపత్రాల రూపంలో అందజేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో సిఎం జగన్ పేద ప్రజల కష్టాలను చూసారు కాబట్టే ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను అమలు చేస్తున్నాం అని అన్నారు. ఎన్నిలకు నెల రోజుల ముందు టిడిపి ప్రభుత్వం రెండు వేలకు పెంచి ప్రజలను మోసం చేసారు. వైస్సార్సీపీ ప్రభుత్వం దశల వారిగా పెన్షన్ ను 3వేలకు తీసుకువెళ్తున్నాం. గత టిడిపి హాయంలో ఏ సంక్షేమ పధకం అందాలన్నా జన్మభూమి కమిటిల వద్దకు వెళ్లాల్సి వచ్చేది అని ఎద్దేవా చేసారు.దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పధకాలను అందిస్తున్నాం అని అన్నారు.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే చూసి ఓర్వలేక ప్రతిపక్ష టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.రాబోయే 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి గా ఉంటారు అని అన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని, గతంలో ఎవరు చేయనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారికి సామాజిక,ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ప్రజలలో రోజురోజుకూ ప్రభుత్వం మీద పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ 22వ డివిజన్ లో ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ప్రశ్నించారు. వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నే ఈ డివిజన్ లో రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరిగిందని దమ్ముగా చెప్పగలం అని అవినాష్ అన్నారు.పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం విద్య అందిస్తూ,నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూలులు,ఆసుపత్రిలు అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజల నుండి జగన్ గారిని వేరు చేయలేరు అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దుర్గారావు, గోపాల్ రెడ్డి, ప్రబాకర్ రెడ్డి, నాగిరెడ్డి,రమణారెడ్డి, ఫజులుద్దీన్, ప్రభాకర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News