విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వహించారు. అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పందనలో ప్రజల నుండి వచ్చిన వినతులకు సంపూర్ణ పరిష్కారం అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నేటి స్పందనలో మొత్తం 21 అర్జీలు సమర్పించగా వాటిలో ఇంజనీరింగ్ విభాగం – 4, పట్టణ ప్రణాళిక విభాగం – 09, పబ్లిక్ హెల్త్ విభాగం – 1, యు.సి.డి (పి.ఓ) – 7, విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల, సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) కె. శకుంతల, జాయింట్ డైరెక్టర్ (అమృత్ ) డా.కె.బి.ఎన్.ఎస్ లతా, ఎస్.ఇ నరశింహమూర్తి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి,మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 3 అర్జీలు
జోనల్ కమిషనర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమములో సర్కిల్ – 3 పరిధిలో ఇంజనీరింగ్ విభాగం – 2, రెవిన్యూ-1 అర్జీలు, సర్కిల్ – 1 మరియు సర్కిల్ – 2 పరిధిలో ప్రజలు ఎటువంటి ఆర్జీలు అందించుట జరగలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.
Prajavartha Online Telugu News