విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గణేష్ నవరాత్రుల సందర్భంగా స్థానిక డిటిసి కార్యాలయం ప్రాంగణంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు ఆధ్వర్యంలో ఉద్యోగులు ప్రతిష్టించిన గణనాధుని విగ్రహానికి రోజు పూజలను నిర్వహించారు. ప్రతిరోజు స్వామివారికి మంత్రపుష్పం గోత్రనామాలతో రెండు పుటలు విశేషపూజలను నిర్వహించారు. వినాయకుని ఉత్సవంలో ఐదవ రోజు ఆదివారంనాడు వినాయకుడికి డిటిసి యం పురేంద్ర పూజల చేసిన అనంతరం నిమజ్జనానికి వినాయకుని విగ్రహాన్ని గూడ్స్ వాహనంపై ఎక్కించి పూలమాలలతో ముస్తాబు చేసారు. ఈ సందర్భంగా డిటిసి యం పురేంద్ర మాట్లాడుతూ ఇలాంటి దైవ కార్యక్రమంను నిర్వహించడం సంతోషదగ్గ విషయమని ఆ గణనాదుని దయ మనందరికీ కలిగి సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. జోన్2 అధ్యక్షుడు యం రాజుబాబు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాలను డీటీసీ కార్యాలయ ప్రాంగణంలో ఇంత పెద్దగా జరుపుకోవడం ఇదే మొదటి సంవత్సరం అన్నారు. గణేష్ ఉత్సవానికి అధికారుల నుండి ఉద్యోగులు వరకు అందరూ సహకరించడం జరిగిందని, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అందరం ఒకే కుటుంబంల కలిసి గణేష్ ఉత్సవాలను జరుపుకున్నామన్నారు.
గణేష్ ని నిమజ్జనోత్సవంలో రవాణాశాఖ అధికారులు ఉద్యోగుల కుటుంబసభ్యుల నడుమ కోలాహలంగా డాన్సులు వేసుకుంటే జై గణేష జై జై గణేష, గణేష్ మహరాజ్ కి జై ..జై అంటూ గణేష్ నామస్మరణతో మారుమోగించారు. డిటిసి కార్యాలయం నుండి టపాసులను కాలుస్తూ ఊరేగింపుగా బయలుదేరి కృష్ణానది పుష్కర ఘాటు వద్ద వినాయకుని మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఆర్ జగదీశ్వర్ రాజు, రవాణాశాఖ టెక్నికల్ అధికారుల సంఘం నాయకులు నారాయణరాజు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నాయకులు కేవివి నాగమురళి, కె రామచంద్రరాజు, బి చంద్రశేఖర్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News