Breaking News

పశు వైద్య శాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న వాహనాలు వేలం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సంచాలకులు, పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి చెందిన పనికిరాని, నిరుపయోగంగా ఉన్న మహేంద్ర కమాండర్, టాటా సుమో, టాటా ఇండిగో, బజాజ్ ఆటో వాహనాలు ఉన్న రీతిన ఉన్నట్లు ఈనెల 15వ తేదీన లబ్బీ పేటలోని పశు వైద్య శాల ఆవరణలో వేలం వేయనున్నట్లు ఆశాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసారు. వేలంలో పాల్గొనే సంస్థలు పాల్గొనే ముందు రూ. 5 వేల రూపాయలు ధరావతుగా చెల్లించి వేలంలో పాల్గొనాలని చెప్పారు. వేలం పాట పాడిన వారు సొమ్మును చెల్లించిన వెంటనే వాహనము స్వాధీనం చేయడం జరుగుతుందని ఆ సమయంలో ధరావత్తు సొమ్ము మినహాయించడం జరుగుతుందని అమరేంద్ర కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు. ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఇతర వివరములను ahd.aptonline.in వెబ్ సైట్ లో పొందవచ్చునని మరియు చేతుర్వేదుల శ్రీనాధ్ ఆఫీస్ మేనేజర్ సెల్ ఫోన్ నెంబర్ 9441281645 లో సంప్రదించి పూర్తి వివరాలు పొందవచ్చునని, కావున ఆసక్తి కలిగిన సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవలెనని సంచాలకులు అమరేంద్ర కుమార్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *