Breaking News

ప్రజల సంక్షేమాభివృద్దే జగన్ లక్ష్యం… : మంత్రి జోగి రమేష్

బంటుమిల్లి (సాతులూరు), నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రజల సంక్షేమాభివృద్దే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకోసం ఆయన ఎంతో శ్రమిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
మంగళవారం ఆయన పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలంలోని సాతులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని గృహాలను సందర్శించారు. లబ్ధిదారుల బాగోగులను ఆరా తీస్తూ, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో వారు పొందిన లబ్ధిని వివరిస్తూ మంత్రి కరపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమాభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, చెప్పనివి కూడా అనుకున్న సమయానికి అన్నిటినీ ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. పథకాలకు అర్హతే ప్రామాణికం అన్నారు. పథకాల అమలులో ఎలాంటి పక్షపాతం, రాజకీయ, కులమత భేదాలు చూపకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. మన అవసరాలు అన్నీ తీరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని మంత్రి ప్రజలను కోరారు.
బంటుమిల్లి కాలువ పక్కనే నివసిస్తున్న కొంతమంది గ్రామస్థులు తమ రాకపోకల కోసం వంతెనతో పాటు రోడ్లు నిర్మించాలని గడప గడపకు తిరుగుతున్న మంత్రిని కోరగా, నియోజకవర్గ నిధులతో ఆ రెండిటినీ నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. మెరకనపల్లి సాయి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ ఇప్పటికే ఎంతో ఖర్చు చేశామని, వైద్యం కోసం సహాయం చేయాలని మత్రిని కోరారు. అందుకు స్పందించిన ఆయన ఆరోగ్యశ్రీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యానికి సహాయం చేస్తానని, తన వ్యక్తిగత సిబ్బంది చేత వివరాలను నమోదు చేయించారు.
గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభానికి ముందు అదే గ్రామంలో రూ.7 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో బంటుమిల్లి జెడ్పీటీసీ మలిసెట్టి వెంకట రమణ, బర్రిపాడు, కంచడం, సాతులూరు గ్రామాల సర్పంచ్ లు పామర్తి వీరవెంకటేశ్వరరావు, బండారు చంద్రశేఖర్, గొల్లా బాలస్వామి, బంటుమిల్లి ఎంపిపి వెలివెల చినబాబు, బంటుమిల్లి ఎంపిడిఓ స్వర్ణ భారతి, బంటుమిల్లి తాసిల్దారు సత్యనారాయణ, ఏఎంసి చైర్మన్ పాలడుగు బాబురావు, పార్టీ మండల కన్వీనర్ రాజబాబు వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *