Breaking News

ప్రతి గడపకు ప్రభుత్వం ఆప్యాయ పలకరింపు : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకొన్న ప్రతి ఇంట్లోని లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్,67వ సచివాలయం పరిధిలోని స్క్రూ బ్రిడ్జి కార్ షేడ్ రోడ్ నుండి మొదలై బావి సెంటర్ ప్రాంతం వరకు ఇంటింటికి పర్యటించిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, డివిజన్ లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం జనరంజకంగా పరిపాలన అందిస్తుంటే తమ రాజకీయ మనుగడ కోసం ప్రజల్లో గుర్తింపు కోసం ప్రతిపక్ష తెలుగుదేశం చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో చేసిన అభివృద్ధి గురుంచి చెప్పుకోడానికి కూడా ఏమి లేదని,కానీ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్లు, డ్రైనేజీ,మంచినీటి సరఫరా ఏర్పాట్లు తో పాటు ముఖ్యంగా నియోజకవర్గ ముస్లింలు అందరికి ఉపయోగపడేలా షాధికాన బిల్డింగ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజల్లో సానుభూతి కోసం వారి అధినేత బాటలో నడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాళ్ళ నాయకులు చేత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, వ్యక్తిగత గొడవలకు కూడా పార్టీ రంగు పులుముతూ అనవసర రాద్దాంతం చేస్తున్నారు అని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ప్రజల ను మభ్య పెట్టడం కుదరని పని అని,వారికి ప్రభుత్వం చేస్తున్న మంచి కంటికి కనపడుతుంది అని వారి మద్దతు ఎప్పుడు మాకే అని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,19వ డివిజన్ కార్పొరేటర్ రహేన నాహిద్,కో ఆప్షన్ మెంబెర్ అలీమ్ వైస్సార్సీపీ నాయకులు నహీద్, షేక్ సుభాని,జగ్జీవన్ రావ్, చింతగుంట విజయ్, పోతురాజు, బోసు ,నాగ లత ప్రభుదాస్,సలీం,పిల్లి వెంకట్, రత్నకుమారి,అనిత, రమ, భత్తులు నాగేశ్వరరావు, డేవిడ్ అబ్బాస్.బినియమిన్, రబ్బాని బాబు బాయ్ ,అస్గర్ ఏసుబాబు, ప్రతాప్, మౌలాలి ,రామ్,క్రాంతి,జావిద్ పటాన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *