-సిఐఐ యంగ్ ఇండియన్స్ కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
పారిశ్రామిక వేత్తలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవకు పునరంకింతం కావాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల నేపధ్యంలో రాజ్ భవన్ వేదికగా యంగ్ ఇండియన్స్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెదురు, గడ్డితో యంగ్ ఇండియన్స్ సంస్ధ రూపొందించిన దుస్తులను గవర్నర్ ఆవిష్కరించారు. యంగ్ ఇండియన్స్ 75 వసంతాల వేడుకల ఛైర్మన్ మండవ సందీప్ మాట్లాడుతూ 7,000 మంది యువత, విధ్యార్ధులను భాగస్వాములను చేస్తూ విభిన్న కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ పూర్వ ఛైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ తమ భాగస్వామ్యసంస్ధలు సామాజిక సృహతో విభిన్న కార్యక్రమాలు చేపడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో యంగ్ ఇండియన్స్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు బెనర్జి, సహ అధ్యక్షులు వందన, ఇసి సభ్యులు హారిక, డాక్టర్ భవన్ చంద్ వారి కార్యకలాపాల గురించి వివరించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News