Breaking News

విజయవాడ మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు అన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తాం…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలల్లో అజమాయిషీ, పరిపాలన బాధ్యతలను GO నెంబర్ 84ద్వారా పాఠశాల విద్యాశాఖకు అప్పగించిన దరిమిలా, ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు  మేయర్  రాయన భాగ్యలక్ష్మి నగర పాలకసంస్థ లో పనిచేయుచున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయ సంఘ నాయకులను పిలిపించి చర్చించటం జరిగింది. ఈ సమావేశంనకు 11ఉపాధ్యాయ సంఘాల నుండి ఒక్కో సంఘమునకు ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఒక సంఘం నుండి ఒకరు మొత్తం 23 మంది హాజరు అవ్వటం జరిగింది.

ఈ సమావేశం లో ముందుగా మేయర్  ఉపాధ్యాయుల సమస్య ఏది ఉన్న రాతపూరకంగా తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత మంత్రివర్యులు గారితో లేదా అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తాను అని తెలిపారు అదేవిధంగా బాధ్యతలు స్వేకరించిన వెంటనే ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్యానెల్ లిస్ట్ తయ్యారు కాకపోతే వెంటనే తయ్యారు చేయించి 4 మంది స్కూల్ అసిస్టెంట్ లకు ప్యానెల్ గ్రేడ్ ప్రధానోపాధ్యాయులగా పదోన్నతులు కల్పించటం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం మునిసిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే కాలయాపన కావించకుండా 10మంది సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్ లుగా ఒకరికి LFL ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతులు కల్పించటం జరిగిందని, రాష్ట్రములో ఎక్కడా లేని విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించటం కోసం 250 మంది విద్యావాలంటీర్స్ ను నియమించటం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నగరపాలక సంస్థ లో పెండింగ్ లో ఉన్న ఇంక్రిమెంట్ ఆరియర్ బిల్లులు, రిటైర్అయిన ఉపాధ్యాయుల జి ఐ ఎస్, అర్ధజీతపు పెండింగ్ బిల్లులు, 010 కంటే ముందున్న నోషనల్ ఇంక్రిమెంట్ యరియార్ బిల్లులు,ప్రాన్ అకౌంట్ కంటే ముందు ఉన్న CPS అమౌంట్ లు, తెలుగు పండితుల పదోన్నతులు,398స్పెషల్ టీచర్స్ నోషనల్ ఇంక్రిమెంట్ లకు సంబందించిన సమస్యలు ఇలా సంఘ నాయకులు లేవనెత్తిన అనేక సమస్యలను సావధానంగా విని పరిస్కారం కోసం అధికారులతో, డిస్ట్రిక్ట్ ట్రెసరీ అధికారులతో చర్చిస్తానని త్వరలోనే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  వద్దకు సంఘ నాయకులను తీసుకొని వెళ్లి సమస్యలు పరిస్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. చివరిగా సంఘ నాయకులు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది విద్యావాలంటీర్స్ నియమించమని కోరగా వెంటనే స్పందించి ఈ సంవత్సరము కూడా విద్యావాలంటీర్స్ ను తీసుకుంటామని తెలిపారు, ఉపాధ్యాయు సంఘాలను పిలిచి సమస్యల గురించి చర్చించినందుకు సంఘ నాయకులు అందరూ కృతజ్ఞతలు తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్(జనరల్ )యం. శ్యామల, సూపరింటెండెంట్ శారదా రాణి గారు పాఠశాల స్కూల్ సూపర్ వైసర్స్ కే. రాజశేఖర్, మహమ్మద్ హుస్సేన్, షేక్ సైదాసాహెబ్ వివిధ సంఘాల నుండి నయీమ్ అహమ్మద్, కే శ్రీనివాసరావు, యం. శ్రీనివాసరావు, కిషోర్, ఇంతియాజ్, కుమార్రెడ్డి, మాణిబాబు, TSN ప్రసాద్, గణేష్, చంటిబాబు, ఇక్బాల్ బాషా, మస్తాన్ రావు, హఫీజ్, ఇంటిరాజు, ms ప్రసాద్, సత్యం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *