-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాస్థాయి కమిటీ ఆధ్వర్యంలో మూడు మాసాలలో జిల్లాలోని 98 పరిశ్రమలలో తనిఖీలను నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గుడివాడ అమర్నాద్, పరిశ్రమలశాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరి కరికాల వలవన్లకు వివరించారు.
ఇటివల రాష్ట్రంలో తరచు పరిశ్రమల జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు చేపట్టవలసిన చర్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సచివాలయం నుండి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ఇటివల తరచు పరిశ్రమలలో ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ సభ్యులు పరిశ్రమలలో తనిఖీలు ఆడిట్లను నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీలో పొల్యూష్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరి, పరిశ్రమల శాఖ డైరెక్టర్, లేబర్ కమీషనర్, కమీషనర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లా స్థాయి కమిటీలో పరిశ్రమల శాఖ జనరల్ అధికారి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటి కమీషనర్ ఆప్ లెబర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రిజనల్ ఆఫీసర్లను సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. పరిశ్రమలలో తనిఖీలు నిర్వహించి నివేదికలను సమర్పించాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 98 పరిశ్రమలను ఎ.బి.సి కేటగిరిలుగా గుర్తించడం జరిగిందన్నారు. ‘ఎ’ కేటగిరిలో బారీ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న 9 పరిశ్రమలు ఉన్నాయని వీటిలో జి. కొండూరులోని గెయిల్ ఇండియా లిమిటెండ్ బూస్టర్ స్టేషన్, హెచ్‌పిసిఎల్ ఆయిల్ కంపెనీ, బిపిసిఎల్ ఆయిల్ కంపెనీ, బిపిసిఎల్ గ్యాస్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, లాంకో పవర్ స్టేషన్, డాక్టర్ ఎన్టిటిపిఎస్ వంటి పరిశ్రమలు ఉన్నాయన్నారు. ‘బి’ కేటగిరిలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్న మెటీరియల్‌ను కెమికల్స్‌ను నిల్వ చేసే అవకాశం ఉన్న 37 పరిశ్రమలు గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో మిల్క్ ఫ్యాక్టరీ, మోడల్ డెయిరీ, స్పెక్ట్రా ఫుడ్స్,బేవరేజస్, రవీంద్ర సాల్వెంట్ ఆయిల్, లక్ష్మి ఆర్గానిక్స్, ఎఎస్ బల్క్ డ్రగ్స్, ఆర్చీ లేబరేటరీ, జియంకె ల్యాబ్స్, రాణి లైఫ్ సైన్స్, ఇంకెమ్ లేబరేటరీ, కాకుల లైఫ్ సైన్స్, శ్రీనిజ డ్రగ్స్, నిఫ్టి ల్యాబ్స్, కెయంటికె లేబరేటరీస్, కొండపల్లి ఎన్విరోటెక్, రాయిస్ ఆర్గానిక్స్ , రా`ఛంఫార్మా లిమిటెడ్, ఇంటిగ్రిన్ లైఫ్‌సైన్స్, దినకర్ లైఫ్‌సైన్స్, ఐనేషా ఫార్మా, సికెఎస్ ఫార్మా, సహష్ట్రా లైఫ్‌సైన్స్, ఇన్విత కెమికల్స్, భాగ్యనగర్ గ్యాస్, విజయ్అగ్రో ప్రొడక్ట్స్, శాంత్రూస్ ప్రైవేట్ లిమిటెడ్, సాయికృష్ణ ఐస్ ఫ్యాక్టరీ, త్రిపురాంబ కోల్డ్ స్టోరేజ్ , తిరుమలగిరి ఆగ్రోప్రొడక్ట్స్, యలమంచిలి కోల్డ్ స్టోరేజ్, స్పూర్తి కోల్డ్ స్టోరేజ్, పరిటాల కోల్డ్ స్టోరేజ్, కాకర్ల కోల్డ్ స్టోరేజ్, శ్రీ సాయి భార్గవ కోల్డ్ స్టోరేజ్, వాసు కోల్డ్ స్టోరేజ్, హరిత కోల్డ్ స్టోరేజ్ వంటి పరిశ్రమలు ఉన్నట్లు అధికారులు గుర్తించడ జరిగిందన్నారు. వీటిలో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ‘ సి’ కేటగిరిలో మరో 44 పరిశ్రమలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుర్తించిన జరిగిందని తెలిపారు. ఆయా పరిశ్రమలను మూడు నెలలలోపు కమిటి సందర్శంచి పూర్తి స్థాయిలో ఆడిట్ తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుని నివేదికలను సమర్పించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గుడివాడ అమర్నాద్, పరిశ్రమలశాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరి కరికాల వలవన్లకు వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డిప్యూటి ఛీప్ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ కె. శ్రీనివాస్‌రావు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యం శ్రీనివాస్‌రావులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News