-ప్రారంభించవలసిన భవనాలకు వారంలోపు శంకుస్థాపనకు చర్యలు ..
-జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
గడువులోపు ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణ పనులను పూర్తి చేసేలా ప్రణాళికాబద్దంగా పనులను వేగవంతం చేశామని ప్రారంభించవలసిన భవనాలకు వారంలోపు శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది , పంచాయతీరాజ్ కమీషనర్ కోన శశిధరకు వివరించారు. పరిశుభ్రత ప్రభుత్వ ప్రాధాన్యత భావనాలైన రైతు భరోసా కేంద్రాలు , గ్రామ సచివాలయాలు , వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు డిజిటల్ లైబ్రరీలు తదితర భవన నిర్మాణపు పనుల ప్రగతిపై గురువారం ఏపి ప్రిన్సిపాల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమీషనర్ కోన శశిధర్ జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఎన్టీఆర్ జిల్లా నుండి జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 148 పూర్తయ్యాయన్నారు. 260 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు గాను 76 భవన నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు . మరో 184 భవనాలను పూర్తి చేయవలసి ఉన్నాయని నిర్మాణాల పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. 239 వైయస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలకు గాను 51 భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మిగిలిన భవనాల పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు .
భవన నిర్మాణాలకు సంబందించిన సిమెంట్, ఇసుక, ఐరన్ వంటి మెటీరియల్ అందుబాటులో ఉంచామని , వెనుకబడిన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేస్తామని కలెక్టర్ వివరించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు ఆదేశిస్తూ జగ్గయ్యపేటలోను , మైలవరం మండలంలో మురుసుమిల్లి,పొందుగల ,పుల్లూరు ,నందిగామ మండలంలో మాగల్లు, లింగాలపాడు, రామిరెడ్డిపల్లి , వీరులపాడు మండలంలో వీరులపాడు, తాటిగుమ్మి గ్రామలలో ప్రభుత్వ ప్రాదాన్యత భవనాల పై ప్రత్యేక దృష్టి పెట్టి పురోగతిని సాధించాలని ఆదేశించారు. డివిజినల్ పంచాయితీ అధికారులు, ఈవోపీ ఆర్డీలు గ్రామాలను సందర్శించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయితీ రాజ్ ఇఇ అక్కినేని వెంకటేశ్వరరావు , ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ ఇ వెంకటరమణ , జిల్లా పంచాయితీ అధికారి జె.సునీత , సంబంధిత అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News