Breaking News

ప్రశాంతంగా సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న నగరంలోని ఎస్ ఆర్ ఆర్ అండ్ సి వి ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. 161 మంది అభ్యర్థులు మైన్స్ పరీక్షలు వ్రాస్తున్నారని వీరిలో నేడు 160 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని, పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పరిశీలనలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, డి ఆర్ ఓ కె. మోహన్ కుమార్, జిల్లా ఉపాధి అధికారి డా. ప్.వి. రమేష్ కుమార్, తహసీల్దార్ దుర్గా ప్రసాద్ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *