Breaking News

చిన్నారికి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం.. రూ.17.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్…

కడప, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ప్రత్యేక చొరవతో.. నగరానికి చెందిన సయ్యద్ షబానా అనే 12 ఏళ్ల చిన్నారి అనారోగ్యం భారీ నుండి కోలుకోనున్నారు. కాలేయ వ్యాధి సమస్యతో బాధపడుతున్న కడప నగరం.. 48వ డివిజన్ చెందిన 12 సంవత్సరాల పాప సయ్యద్ షబానా ను వైద్యం నిమిత్తం.. చెన్నై లోని గ్లోబల్ వైద్యశాలలో చేర్పించడం జరిగింది. ఆమెకు లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ శస్త్ర చికిత్స అవసరం అవ్వడంతో… వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సాయం అందించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ భాషను ఆశ్రయించడం జరిగింది. వెంటనే స్పందించిన ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడి.. సీఎం సహాయ నిధి ద్వారా.. హాస్పిటల్ కు చెల్లించాల్సిన ఫీజు మొత్తం రూ.17.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కాగా.. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా విజయవాడ క్యాంపులో ఉండడంతో.. సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేటాయించిన రూ.17.5 లక్షల ఎల్.ఓ.సి. మంజూరు పత్రాన్ని ఆదివారం కడపలోని ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన సోదరుడు, వైసీపీ యువ నాయకులు అహ్మద్ బాషా.. బాధిత కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా అహ్మద్ బాషా మాట్లాడుతూ షబానా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం.. తన లివర్ ను డోనేట్ చేస్తున్న బాధితురాలి తల్లికి, వారి శస్త్ర చికిత్స కోసం ఆర్ధికంగా సాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, బాధిత కుటుంబానికి సహకరించిన ఉపముఖ్యమంత్రికి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఆ దేవుడి దయ బాధిత కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, చిన్నారి షబానా, ఆమె తల్లి ఇరువురూ ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తిచేసుకుని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అహ్మద్ బాషా ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *