Breaking News

ప్రజల సహకారంతోనే పారిశుధ్యత సాధ్యం…

-అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
స్వచ్చ్ అమృత్ మహోత్సవం లో భాగంగా నగరంలోని 48, 49 వ డివిజన్లలో, చిట్టినగర్ ప్రాంతంలో బుధవారం అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, విఎంసి అధికారులు, స్థానిక కార్పొరేటర్లు తో కలిసి స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో అవగాహన కలుగజేస్తు చిట్టినగర్ లో ర్యాలీ నిర్వహించారు. అపరిశుభ్రంగా వున్న డ్రెయిన్లు బాగుచేసి సిల్టును ఎత్తి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. అలాగే మెయిన్ రోడ్ లో వున్న మసీద్ వెనుక వైపు ఉన్న ఈద్గాహ్ ప్రాంగణంలోని గడ్డిని పీకివేసి అక్కడ మొక్కలను నాటారు. KT రోడ్డు లోని మట్టా లాజరస్ స్కూల్ గోడకు పెయింట్ లు వేశారు. స్థానిక ప్రజలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా కలిసి కార్యక్రమం లో పాల్గొన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ నిర్వహస్తున్న స్వచ్చ విజయవాడ కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని నగరాన్ని మరింత స్వచ్ఛ నగరంగా మార్చేందుకు కృషి చేయాలని ఈ సందర్భగా ACG శ్యామల మరియు కార్పొరేటర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుల్లా విజయ కుమార్, అత్తులూరి ఆదిలక్ష్మి, మరియు జోనల్ కమిషనర్-1 సుధాకర్, హెల్త్ ఆఫీసర్లు డా.సురేష్ బాబు, SS -1 ఒబెస్వర రావు, SI లు, 46,47,48,49 డివిజన్ల సచివాలయం సిబ్బంది, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *