
-చిన్నారులకు వినోదం అందించేందుకు ఎమ్యూజ్మెంట్ రైడ్స్ సిద్ధం
-ఆహ్లాదం.. ఆనందం పంచనున్న ప్రదర్శన, అమ్మకాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగర ప్రజలకు దసరా, దీపావళి పండుగలకు ఆహ్లాదం, ఉల్లాసం కల్గిస్తూ ఆనందంగా గడిపేందుకు వేదికగా నగరంలోని పటమట, రైతుబజారు ఎదురుగ్రౌండ్‌లో ఈనెల 21 (21-9-2022) నుండి వచ్చేనెల (17-10-2022) వరకు దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అందుబాటులోకి వచ్చింది. బుధవారం కోనేరు వెంకటేశ్వరరావు, పెద్దబ్బాయిలు దసరా ఫెస్టివల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభోత్సం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నిర్వహకులు గరిమెళ్ళ జానకి రామయ్య మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల పాటు విశేష అనుభవంతో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మహిళలు షాపింగ్ చేసుకునేందుకు వీలుగా దుస్తులు, జ్యుయలరీ, చెప్పులు, అలంకరణ వస్తువులు, అన్నిరకాల ఫుడ్ స్టాల్స్, గృహాలంకరణ ఉత్పత్తులు ఇలా పలు రకాల స్టాల్స్ ఇందులో ఉన్నాయన్నారు. ప్రతి రోజుల సాయంత్రం 4గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ విజయవాడ వాసులకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఆదివారం, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శన జరుగుతుందన్నారు. శనివారం నుంచి ఈ ఎగ్జిబిషన్ పూర్తిస్థాయిలో నగరవాసుల సందడితో అలరించనుందన్నారు. సాయంత్రం సమయాల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలుగా ఇందులో లేటెస్ట్ ఎమ్యూజ్మెంట్ రైట్స్‌ను ఇక్కడ అనేకం ఏర్పాటు చేశామన్నారు. చిన్నారుల కోసం జెయింటివీల్, టోరాటోరా, చైనీస్‌బోట్, కార్ వీల్ ఇలా ఎన్నో రకాల రైట్స్ ఇందులో ఏర్పాటు చేశామన్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారులు, నిపుణులు తయారు చేసినవి ఇక్కడ అందుబాటులో వుండేలా వారిని ప్రోత్సహించేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, వ్యాపారవేత్త, సామాజికవేత్త గరిమెళ్ళ నాని తదితర నగర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News