రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ , పంచాయతీ రాజ్, సిసిఎల్ఏ, వైద్య ఆరోగ్య, విద్య శాఖల ఉన్నతాధికారులు శాఖా పరమైన ప్రగతి, మల్టీ పర్పస్ గోడౌన్, బల్క్ మిల్క్ యూనిట్స్ లపై జిల్లా కలెక్టర్లతో హౌసింగ్, ఉపాధిహామీ, గృహ నిర్మాణ పనులు, వైద్య ఆరోగ్యం, స్పందన ఫిర్యాదులు, వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థ, పౌర సేవలు, రీ సర్వే , జీ జీ ఎం పి, మన బడి నాడు నేడు, తదితర అంశాలపై విసి నిర్వహించగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత భవనాలు నిర్మాణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇంకా మూడు చోట్ల ప్రాధాన్యత భవనాలకు స్థలాలు గుర్తించడం కోసం భూసేకరణ, దాతలు ద్వారా సేకరణ కై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన 147భవనాలు ప్రారంభిస్తానని సిద్దం చెయ్యాలని ఆదేశించామన్నారు. 650భవనాలు ఇప్పటికే పూర్తి అవ్వగా , పనుల చివరి దశలో ఉన్న 147కూడా ప్రారంభోత్సవముకి సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా ఎస్ హెచ్ జి ల్లో లేని లబ్ధిదారులకు అదనపు ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక చేయూత రుణం కింద ఇచ్చేందుకు బ్యాంకర్ల సమావేశంలో చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో రాబోయే రెండు నెలల్లో మన బడి నాడు నేడు పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేసేందుకు తల్లితండ్రుల కమిటీ లను పర్యవేక్షణలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. ఆయా నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా విషయం పై జెపి సంస్థ కు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News