Breaking News

ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా, అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి కనకరాజు హెచ్చరించారు. విజయవాడ ప్రాంతీయ విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి టి.కనకరాజు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి శనివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలోని కంకిపాడు మండలం పునాదిపాడు, తేలప్రోలు రైతు భరోసా కేంద్రాలు, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఉంగుటూరు రైతు భరోసా కేంద్రం, గణపవరం గ్రామం, మైలవరం మండలం కేంద్రం కేతవీరునిపాడు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. తనిఖీలలో అధికారులు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, రైతులకు అవసరమైన మేలురకపు వంగడాలు మరియు ఎరువులు, పురుగు మందులు వాటి వాడకం పై అవగాహన సదస్సులు నిరాయిస్తున్నారా లేదా, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వాటి వివరాలు, తనిఖీలలో ఏవైనా అవకతవకలు గుర్తించిన సంభందిత వ్యక్తులపై చర్యలు తప్పవని రీజనల్ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి. కనకరాజు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *