విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇన్ని సంవత్సరాలు గడిచినా తిరిగి పునం ప్రతిష్టించక పోవడం పట్ల ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఐ పి టి యు సి రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా ఉన్న దేశోద్ధారక నాగేశ్వరరావు గాంధీ విగ్రహాలు ఉన్నాయి వాటిలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అల్లర్లలో ధ్వంసం కాబడిన గాంధీ విగ్రహాన్ని ఇన్ని సంవత్సరాలు గడిచిన తిరిగి పునః ప్రతిష్టించక పోవడం గాంధీ అంటే పాలకులకు ఏ పాటి గౌరవ మర్యాదలు ఉన్నాయో అన్నది అర్థమవుతుందన్నారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం గాంధీ త్యాగఫలం అనేది మర్చిపోవడం క్షమించరాని నేరం దీనిపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ కూడా వెంటనే స్పందించాలి లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు. రంగా మరణానంతరం జరిగిన గొడవల్లో గాంధీ విగ్రహం దుండగుల చేతుల్లో ధ్వంసం అయింది మహాత్మా గాంధీ గాంధీనగర్ లో పర్యటించారు కనుక ఈ ప్రదేశానికి గాంధీనగర్ అనే పేరు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే జాతిపిత మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కాలయాపన సాగించినచో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. అక్టోబరు 7 తారీఖున ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఐ పి టి యు సి రాష్ట్ర సదస్సు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరుగు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఐపిఎం ఉద్యోగుల సంఘం వారు తెలుపుతూ తమ వంతుగా 20,116 రూపాయలను మహాత్మా గాంధీ కాన్సి విగ్రహా ఏర్పాటుకు తమ వంతు సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ జై బాబు, పేటిటి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఐ పి టి యు సి జిల్లా కార్యదర్శి వల్లభనేని శివ, నగర అధ్యక్షులు నందిపాటి శ్రీనివాస్, విద్యార్థి విభాగం నాయకులు పి. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News