Breaking News

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత సుప్రీం కోర్టు సిజే, ఏపీ హైకోర్టు సీజే

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త:
ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా విచ్చేసిన భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వారికి, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వారికి ఆలయ ముఖ ద్వారం వద్ద జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో లోకనాథం, ఏ ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ముందుగా వీరు ఆలయ ధ్వజ స్థంభంకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. జే ఈ ఓ తీర్థ ప్రసాదాలు అందచేశారు. వీరితో పాటు తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావ్, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్, దుప్పాల వెంకటరమణ, జస్టిస్ గంగా రావు, జస్టిస్ వెంకట రమణ, హై కోర్టు రిజిస్ట్రార్లు తదితులున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ కుల శేఖర్, ఆర్డీఓ కనక నరస రెడ్డి, చిత్తూరు గౌ. జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమరావు, తిరుపతి థర్డ్ ఏ డి జె వీర్రాజు, జ్యుడీషియల్ ప్రోటోకాల్ అధికారి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *