విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామ వార్డు సచివాలయ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాంధీనగర్లోని APNGO’s Home లో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవంలో సెల్యూట్ సి.యం సర్ అంటూ సచివాలయ ఉద్యోగులు నినదించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో సచివాలయ ఉద్యోగులు సెల్యూట్ సి.యం సర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జాని పాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేయడమే మహాత్ముడికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ముందుగా ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎం.డి.జాని పాషా జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా గాంధీజీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసి,రాష్ట్ర వ్యాప్తంగా 15004 సచివాలయాలు స్థాపించి లక్షా ముప్ఫయి నాలుగు వేల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి, ప్రోబేషన్ డిక్లేర్ చేసి నూతన పి.ఆర్.సి ప్రకారం వేతనాలు అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని,కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం సచివాలయ వ్యవస్థ ప్రారంభించి,తమకు ఉద్యోగాలు కల్పించి మూడు సంవత్సరాలు ఐన సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఉద్యోగులకు మిఠాయిలు పంచుకొని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హరీంద్ర,విజయవాడ నగర అధ్యక్షులు స్టాలిన్ చక్రవర్తి,రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్.హరి,కె.కిరణ్ కుమార్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.నవీన్ కుమార్,రాష్ట్ర కోశాధికారి బి.పుల్లారావు,మహిళా విభాగం కన్వీనర్ బి.శ్వేతా,నాయకులు వి.సుజాత, స్వాతి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ పిలుపు మేరకు అన్నీ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, అనాధశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ఆసుపత్రులలో రోగులకు పండ్లు,నిత్యావసర వస్తువులు, అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అన్నీ జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రీజినల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు వివిధ జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News