విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపు కుంటున్నామన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రతి ఇంటా సుఖశాంతులు ఫరిడవిల్లాలని గవర్నర్ ఆకాంక్షించారు. జగన్మాత అనుగ్రహం, కరుణా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నమై వెలగాలని గవర్నర్ హరిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
Prajavartha Online Telugu News