Breaking News

రాష్ట్రంలో అమలులో ఉన్న ఇంటింటికీ రేషన్ పధకం ను అభినందించిన కేరళ రాష్ట్ర ప్రతినిధి బృందం..

-ప్రతి ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేయాలని కోరిన కేరళ ప్రతినిధి బృందం..
-కందులు, మినుములు, పెసలు కూడా సరఫరా చేయాలని కోరిన కేరళ ప్రతినిధి బృందం..
-ఈ నెల 27న కేరళలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించనున్న రాష్ట్ర ప్రతినిధి బృందం. అనంతరం రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకునే అవకాశం..
– రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేరళ రాష్ట్రానికి 60 వేల మెట్రిక్ తన్నులు ఎమ్ టి యు 3626 (బొండాలు) జయ వెరైటీ బియ్యం ను సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం కోరుతున్నదని ఇందుకు సంబంధించి రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  కారుమూరి వెంకట నాగేశ్వర రావు అన్నారు. కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో సోమవారం కేరళ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి  జి. ఆర్. అనిల్, కేరళ రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు.
ఈసందర్భంగా మంత్రి నాగేశ్వర రావు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి ఏటా 60 వేల మెట్రిక్ టన్నుల జయ వెరైటీ బియ్యం తో పాటు కందిపప్పు, పెసలు, మినుములు, ఎండు మిర్చి మొదలగు వాటిని కూడా కేరళ రాష్ట్రం కొనుగోలు చేస్తున్నదని ఇందుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కేరళ ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేశారన్నారు. కేరళ ప్రభుత్వం మిరప నెలకు 550 టన్నులు అవసరం అవుతుందని తెలియజేసిందన్నారు. కేరళ వినియోగదారుల డిమాండ్ ను తీర్చడానికి జయ బియ్యం మరియు ఎండు మిర్చి సరఫరా కొరకు పౌరసరఫరాల శాఖ మరియు ఏ.పి. మార్క్ ఫెడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి కేరళ బృందం ఆసక్తి వ్యక్తం చేసిందన్నారు. ప్రతీ నెల 4500 టన్నుల జయ బియ్యం, 550 టన్నుల ఎండు మిర్చి అవసరం ఉంటుందని కేరళ ప్రతినిధి బృందం తెలియజేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ప్రవేశ పెట్టిన మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ (ఎమ్ డి యు) ద్వారా ఇంటింటికీ రేషన్ పధకం అమలు పరిశీలించిన కేరళ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన విషయాలన్నింటిపై ఈనెల 27వ తేదీన కేరళ లో క్షేత్ర స్థాయిలో రెండు ప్రభుత్వాల ప్రతినిధి బృందాలతో సమావేశం నిర్వహించనున్నామని మంత్రి నాగేశ్వర రావు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో పౌరసరఫరాల శాఖలో రూ. 30 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించమని ఇందుకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని తెలిపారు. 2017వ సంవత్సరం నుంచి ఈ స్కాం జరుగుతున్నదని ఆడిట్ నిర్వహించి ప్రాధమిక నిర్దారణకు వచ్చామన్నారు. ఇందుకు బాద్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితిపై పూర్తి స్థాయి విచారణకు సి ఐ డి ఎంక్వయిరీ చేపట్టాలని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని కోరనున్నామని మంత్రి నాగేశ్వర రావు తెలిపారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సకాలంలో ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుకు చెల్లించవలసిన సొమ్ము ఎటువంటి పెండింగ్ లేదని మంత్రి నాగేశ్వర రావు అన్నారు.
ఈ సమావేశంలో కేరళ ప్రభుత్వం ఆహారం, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రైవేట్ సెక్రటరీ  పి. ప్రదీప్‌కుమార్, కేరళ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంజీబ్ కుమార్ పట్జోషి, కేరళ ప్రభుత్వం పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల కమీషనర్ డా. డి. సజిత్ బాబు, రిజిస్ట్రార్ & కమీషనర్, సహకార సంఘాలు  A. బాబు, ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్, విజయవాడ APSCSCL VC & మేనేజింగ్ డైరెక్టర్  జి.వీరపాండియన్, డైరెక్టర్, పౌరసరఫరాల శాఖ . M.విజయ సునీత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *