Breaking News

ధాన్యం సేక‌ర‌ణలో సిబ్బంది నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేయాలి… : జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా రైతులు తాము పండించిన పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేక‌ర‌ణ విధానాన్ని అమ‌లు చేస్తోంద‌ని సంబంధిత అధికారులు, సిబ్బంది నిబద్ధ‌త‌తో ప‌నిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశించారు.
శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు సెంటర్ సమీపంలోని రెవిన్యూ కళ్యాణ మండపంలో 2022- 23 ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిబ్బందిని సమాయత్తం చేస్తూ జిల్లాలోని ఎం.పి.డీ.ఓలకు, తహసీల్దార్లకు, మండల వ్యవసాయశాఖాధికారులకు, ప్రజాపంపిణీ వ్యవస్థ, వ్యవసాయశాఖ, పౌర సరఫరాలశాఖ సిబ్బంది ధాన్య సేకరణలో తీసుకోవాల్సిన సూచనలు, సలహాలు, జాగ్రత్తలు గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ పలు అంశాలపై వారికి అవగాహన కల్గించారు. ధాన్యం సేకరణలో గతంలో మిల్లర్లే ప్రధాన భూమిక పోషించారని, అయితే మిల్లుకు ధాన్యం చేరిన తర్వాతే వారి పాత్ర మొదలవుతుందన్నారు. ఖ‌రీఫ్ (2022-23) సీజ‌న్‌కు సంబంధించి ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ న‌వంబ‌ర్ రెండో వారం నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో రైతు భరోసా కేంద్రాలలో (ఆర్‌బీకే) ధాన్యం నాణ్య‌తా ప్ర‌మాణాల ప‌రీక్షా ప‌రిక‌రాల‌ను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింద‌ని.క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బంది సపోర్టింగ్ ఏజెన్సీ స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తూ ఎలాంటి పొర‌పాట్ల‌కు తావులేకుండా ధాన్యం సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌న్నారు. ఈ ప్ర‌క్రియ‌లో టెక్నిక‌ల్ అసిస్టెంట్ల పాత్ర చాలా కీల‌క‌మైంద‌న్నారు. టెక్నిక‌ల్ అసిస్టెంట్లు, క‌స్టోడియ‌న్ ఆఫీస‌ర్లు, వాలంటీర్లు త‌దిత‌రుల‌ ఈ శిక్ష‌ణ‌ను స‌ద్వినియోగం చేసుకొని క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వ‌ర్తించాల‌ని సూచించారు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, అందుకు అనుగుణంగా అధికారులు మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ అమలుచేయాలన్నారు.
ఈ ఖరీఫ్ సీజన్లో కృష్ణాజిల్లాలో నవంబర్ రెండవ వారంలో ధాన్యం సేకరణ కంకిపాడు, పెనమలూరు మండలంలో తొలుత ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 5 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అంచనా ఉన్నందున, 323 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాలలో అన్ని వసతులు కల్పిస్తూ రైతులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మరి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పంట పండించిన రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చే విదంగా అలాగే ధాన్యపు గింజలో తేమశాతం 17 శాతం మించకుండా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అత్యధిక తేమ శాతం ఉంటే, ధాన్యం ఎండబెట్టి తిరిగి తీసుకురావాలని చెప్పాలన్నారు. ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్-ఏ రూ. 2060, గ్రేడ్ సి కామన్ వెరైటీ రూ. 2040 కల్పించాలని సూచించారు. అన్ని కేంద్రాలలో ధాన్యం శుద్ధి మిషన్లు, తేమశాతం మీటర్లు, ఖంటాలు తప్పక అందుబాటులో ఉంచాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతులకు పూర్తిగా సహకరించాలని సూచించారు. ఇతర జిల్లాల నుండి ధాన్యం రాకుండా చెక్ పోస్టులలో గట్టి నిఘా ఉంచాలని అలాగే జిల్లాలో వర్షాలు తరుచుగా కురుస్తున్నందున కొనుగోలు చేసే ధాన్యం తడవకుండా వాటర్ ప్రూఫ్ టార్పానిలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ప్రభుత్వం సచివాలయం ద్వారా నియమించబడిన (వాలంటీర్)”రైతుసహాయకుడు” సహాయంతో ఫార్మ్‌గేట్ నుండి వరి నమూనా సేకరణ చేయడం, అలాగే రైతు భరోసా కేంద్రంలో 5 రకాల పరీక్ష లను నిర్వహించడం ద్వారా వరి నమూనా విశ్లేషణ పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. మిల్లర్ ద్వారా వరి విశ్లేషణకు సంబంధించి ఏదైనా వివాదం ఉంటే, సాంకేతిక సహాయకుడే నిర్వహించాలని రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులందరి నమూనాలు, విశ్లేషణ, నివేదికల నిర్వహణ, సంరక్షణ బాధ్యత సాంకేతిక సహాయకుడే తీసుకోవాలి. అలాగే, విలేజ్ అసిస్టెంట్ సమన్వయంతో సకాలంలో కూపన్ జనరేషన్ షెడ్యూల్ నిర్వహించాలని అన్నారు. ధాన్యం సేకరణ పూర్తయ్యే వరకు రైతు భరోసా కేంద్రాలు, ధాన్య సేకరణ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలన్నారు. దళారులు, రైస్ మిల్లర్‌లకు ఆపద ధరకు వరిని ఏ ఒక్క రైతు అమ్మడం లేదని నిర్ధారించుకొని నష్టాలలో ధాన్యం విక్రయానికి సంబంధించిన ప్రతికూల వార్తలను నివారించాలన్నారు రైతులకు గోనె సంచులు, హమాలీలు, రవాణా కేటాయింపు విషయం లో బాధ్యతతో ఉండాలన్నారు. అలాగే గ్రామంలో రిజిస్ట్రేషన్ గల రైతులు ఇతర ప్రైవేట్ వాహనాలను సమీకరించాలని అన్నారు. గ్రామంలో అందుబాటులో ఉన్న హమాలీ ఏజెన్సీల మ్యాపింగ్ చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. షెడ్యూల్డ్ కూపన్ సేకరణ ప్రకారం సకాలంలో జరుగుతుందన్నారు. నిర్ణీత తేదీకి రైతు వరిని విక్రయించకుంటే రైతు కూపన్ల రీషెడ్యూల్ చేయాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో వడ్లను విక్రయించిన రైతుల డేటాను సేకరించి వరి సేకరణ పోర్టల్ లో ఆ విధంగా పాల్పడిన రైతుల సర్వే నంబర్లు తొలగించాలని సూచించారు. వ్యవసాయం క్షేత్రం ధాన్యం కుప్ప వద్ద కనీసం 9 చోట్ల ధాన్యం నమూనా సేకరణ చేయాలన్నారు. ఆ వరి కుప్ప నుంచి కనిష్టంగా 2.5 కిలోల వరిని సేకరించాలని ఆ విధంగా సేకరించిన నమూనాను రైతు భరోసా కేంద్రం వద్ద విశ్లేషణ చేయడానికి జిప్ వేయబడిన పాలిథిలిన్ సంచిలో భద్రపరచాల్సి ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ చైతన్య , జిల్లా పౌరసరఫరాల జిఎం శ్రీధర్, డి సి ఓ పార్వతి, జిల్లా వ్యవసాయశాఖాధికారి ఎస్ వై వి ఎస్ మనోహరరావు, జిల్లా కో-ఆపరేట్ అధికారి వి. వి. ఫణికుమార్, మార్కెటింగ్ ఏ డి నిత్యానంద్, వివిధ శాఖల సిబ్బంది, పలువురు రైతు సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *