Breaking News

సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి సిఫార్స్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధి హామి ఉద్యోగుల కార్యాచరణ కమిటీ (జెఏసి) దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జెఏసి ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వానికి సిఫార్స్‌ చేయాలని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావుకు జెఏసి కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఉపాధి హామి పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని పిఆర్‌సి అమలు, పదోన్నతులు గ్రేడ్‌ఫిక్సేషన్‌ అలవెన్సులను మూల వేతనంలో కలపడం, క్యాష్‌ లెస్‌ హెల్త్‌ కార్డులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఎఫ్‌టిఇ లుగా మార్పు తదితర దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ ఉపాధి హామిలో కూలీలకు పనులు కల్పించడంలో రాష్ట్రంలోనే జిల్లాను అగ్రగామిగ నిలపడంతోపాటు అమృత్‌ సరోవర్‌లో భాగంగా 24 చెరువులను అభివృద్ధి చేసి సుందరీకరించడం పట్ల జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె. సునీత, ఉద్యోగులను అభినందించారు. ఉపాధి హామి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తానని కలెక్టర్‌ అన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ జె.సునీత, జెఏసి అధ్యక్షులు వి. వెంకటేశ్వరరావు , జాయింట్‌ సెక్రటరీ కె.రజేష్‌, ప్రతినిధులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, సతీష్‌ చంద్ర, బాస్కర్‌రావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *