Breaking News

లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-అధికారులతో కలిసి క్షేత్రసాయి పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు ప్రక్షాళనలో భాగంగా కండ్రికలోని డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ వద్ద పేరుకున్న తూటికాడను యుద్ధప్రాతిపదికన తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ముంపు సమస్యపై దృష్టి సారించిన ఆయన ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కండ్రిక, ఇన్నర్ రింగ్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. అజిత్ సింగ్ నగర్ నుంచి 33 తూముల వరకు 6 డివిజన్ల పరిధిలో స్ట్రోం వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి రూ. 49.60 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినట్లు ఈ సందర్భంగా అధికారులకు ఎమ్మెల్యేకు వివరించారు. దీని ద్వారా కండ్రిక, ఎన్.ఎస్.సి. బోస్ నగర్, ఎల్బీఎస్ నగర్, ఉడాకాలనీ, రాజీవ్ నగర్ సహా పలు లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మల్లాది విష్ణు అన్నారు. డీపీఆర్ ను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. అలాగే కండ్రిక్ సర్కిల్ డీపీ స్టేషన్ వద్ద రెండు నూతన కల్వర్టుల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయవలసిందిగా ఆదేశించారు. దీని ద్వారా భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో ఎగువ ప్రాంతాలు, కొండల నుంచి వచ్చే వర్షపు నీరు, ప్రజావసరాలకు వినియోగించిన నీటిని 33 తూముల ద్వారా బుడమేరులోకి కలిపేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. మరోవైపు రైల్వే సమస్యపై మూడు శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా కలెక్టర్ తో చర్చలు నిర్వహించి పరిష్కారం దిశగా దృష్టి సారించాలన్నారు. అనంతరం గుణదలలో పర్యటించిన ఆయన బుడమేరుపై రెండు వంతెనల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ ఎస్ఈ ఎస్.తిరుమల రావు, ఈఈ విష్ణుమోహన్ రావు, డీఈ సత్యనారాయణ, ఏఈ రాజశేఖర్, డీఈ (ఇంజనీరింగ్) గురునాథం, సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *