విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి పట్టణంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి దర్గా ను గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు సోమవారం సందర్శించారు. ఆస్థాన పిఠాధిపతి అల్తాఫ్ బాబా వారిని సాదరంగా ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సన్మానించారు. అనంతరం బాబా గారి వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. దాసరి ఉమామహేశ్వర సతీమణి గుంటూరు కన్జ్యూమర్ కమిషనర్ దాసరి సునీత దంపతులకు ఈ దర్గాతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతత కలుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రముఖ న్యాయవాదులు మసూద్ అలీ జిల్లా, మస్తాన్వలి, సుబ్బారావు, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి వాహేద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News