Breaking News

జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమంను పక్కాగా అమలు చేయాలి

-ప్రభుత్వ ప్రాధాన్యత గల భవనాల నిర్మాణాలను వేగవంతం చేయండి:
-రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలలో సంపూర్ణ పారిశుద్ధ్యం పై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం ఉదయం గ్రామ కంఠoల రీ సర్వే, జగనన్న స్వచ్చ సంకల్పం, ఉపాథి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, లేబర్ మొబలైజేషన్, ఏ ఎం సి యు, బి ఎం సి యు తదితర అంశాలపై విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో, సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమీషనర్ కోనా శశిధర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుండి జేసి డి.కె.బాలాజీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ…. గ్రామ కంఠo ల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాలలో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా సంపూర్ణ పారిశుధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులతో సమావేశమై జిల్లాలో 434 రైతు భరోసా కేంద్రాలుగాను 232 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు, 482 గ్రామ సచివాలయం భవనాలు గాను 329 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలు, 387 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లకు గాను 147 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని మిగిలిన వాటిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ కంఠoల రీ సర్వే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు తదితర పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా లక్ష్యాలను నిర్దేశించుకుని చెత్త సేకరణ, ప్లాస్టిక్ వ్యర్థాలను విడిగా చేయడం సంపద కేంద్రాల ఆదాయంపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి డి డ్వామా శ్రీనివాస్ ప్రసాద్, ఆర్ బ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, డి పి ఓ రాజశేఖర్ రెడ్డి, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *