-పేద చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతంమే ప్రభుత్వ లక్ష్యం…
-జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల వారికి స్థిరమైన అస్తిని ఏర్పాటు చేసి నిరంతర ఆదాయం చేకూర్చడం ద్వారా రైతుల జీవితాలలో వెలుగువు నింపాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామి పథకం క్రింద అందించిన సహాయంలో చేపట్టిన పండ్ల తోటల ఆధునిక వ్యవసాయ పద్దతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.
ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామ సమీపంలో ఉపాధి హామి పథకం కింద సన్నకారు రైతు చేపట్టిన నిమ్మ తోటను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉపాధి హామి పథకం ద్వారా పండ్ల తోటలను పెంచేందుకు ముందుకు వచ్చిన రైతులను ప్రోత్సహించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్‌టిఆర్ జిల్లాలో అధిక భాగం మెట్ట ప్రాంతంలో ఉందని పండ్ల తోటలను పెంచేందుకు ఎంతో అనువుగా వుంటుందన్నారు. పండ్ల తోటలను పెంపకంకు ముందుకు వచ్చే ఔత్సాహికులైన బడుగు బలహీన వర్గాలకు చెంది భూమి కలిగిన రైతులకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా ఉపాధి హామి పథకం కింద నిమ్మ, మామిడి, జమ, సపోట, చింత, సీతాఫలం, నేరేడు వంటి పండ్ల తోటలను పెంచుకునేందుకు అయ్యే ఖర్చులో మూడు సంవత్సరాలపాటు నూటికి నూరు శాతం ఉపాధి హామి కింద సహాకారం అందించడం జరుగుతుందన్నారు. కుటుంబం మొత్తంలో ఐదు ఎకరాలలోపు భూమి కలిగి వుండి ఉపాధి హామి కార్డు పొంది నీటి సౌకర్యం కలిగిన రైతులకు పండ్ల తోటల పెంపకానికి అర్హులుగా నిర్ణయించడం జరిగిందన్నారు. పండ్ల తోటలను పెంచేందుకు ఆశక్తి కనపరచిన రైతులకు భూసార పరీక్ష, మొక్కల కొనుగోలు, రవాణ, గుంతలు తీసుకోవడానికి, మొక్కలు నాటడానికి, నీరు పోసి సంరక్షించేందు, వర్మి కంపోస్టు ఎరువుకు, పొలం దునుటకు, అంతర పంటలు చేపట్టేందుకు మూడు సంవత్సరాలకు అయ్యే ఖర్చు ఎకరానికి సుమారు రెండు లక్షలకు పైగా ప్రభుత్వం ఉపాధి హామి పథకం నిధుల ద్వారా సహాకారం అందించడం జరుగుతుందన్నారు. ఉద్యాన శాఖ అధికారులు సూచనలు సలహాలతో పండ్ల తోటలను అభివృద్ధి చేసుకుని ఆధిక దిగుబడులను సాధించి ఆర్ధికంగ బలోపేతం కావాలని జిల్లాకలెక్టర్ డిల్లీరావు రైతులకు సూచించారు.
నిమ్మ తోట పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత, యంపిడివో బి. రామ కృష్ణ నాయక్, యంఆర్‌వో యం. సూర్యారావు, ఎంపిపి పి. జోత్స్న, డ్వామా ఏపివో వి. వెంకటేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ కె. ప్రసన్నకుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ యం నాగమణి, బిఎఫ్‌టి ఎన్ జయరాజ్, రైతులు ఉన్నారు.
Prajavartha Online Telugu News