విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన ఆర్జీలను అధికారులు పూర్తిగా పరిశీలించి పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. స్పందనలో పునరావృతమవుతున్న ఆర్జీలకు సంబంధిత ఆర్జీదారులు, అధికారులతో శనివారం కలెక్టర్ డిల్లీరావు నగరంలోని ఆయన కార్యాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ పునరావృతమవుతున్న (రీఒపెన్) స్పందన ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. స్పందన ఆర్జీలను అధికారులు నిశితంగా పరిశీలించి, పునరావృతం కాకుండా ఆర్జీదారుడు సంతృప్తి చేందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనవారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా స్పందనలో పునరావృతమవుతున్న (రీ ఒపెన్) 5 ఆర్జీలకు సంబంధించి సమస్యలను ఆర్జీదారులు, అధికారులతో ముఖాముఖీ ద్వారా పరిష్కారం చూపారు. విసన్నపేటకు చెందిన బొట్టు నవీన్, జి కొండూరు మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పచ్చిగోల్ల బాపుజి, కంచికచర్ల మండలం కునికినపాడు గ్రామానికి చెందిన నల్ల కమలకుమారిలకు సంబంధించిన రెవెన్యూపరమైన సమస్యలను, హౌసింగ్ సంబంధించిన విజయవాడ టైలర్పేటకు చెందిన ఏనుగుల అదిలక్ష్మి సమస్యను, జి కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన సూరెడ్డి రaాన్సీలక్ష్మి విద్యుత్ పరమైన సమస్యను జిల్లా కలెక్టర్ డిల్లీరావు జూమ్ కాన్ఫరెన్స్లో సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించారు. జూమ్ కాన్ఫరెన్స్లో ఆర్జీదారులు, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News