Breaking News

అను ఇనిస్టిట్యూట్ అద్భుత విజయం


-ఈ ప్రాంతంలో తొలిసారిగా అత్యంత క్లిష్టమైన హైబ్రిడ్ టీవర్ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన అను వైద్యులు
-పెద్ద ధమని చిట్లిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో వున్న పేషేంటుకు అరుదైన శస్త్రచికిత్స
-అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలి
-అను ఇనిస్టిట్యూట్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ ఇనిస్టిట్యూట్ వైద్యులు మరోసారి అద్భుతం చేశారు. ఈ ప్రాంతంలో తొలిసారిగా అత్యంత క్లిష్టమైన, అరుదైన హైబ్రిడ్ టీవర్ చికిత్సను విజయవంతంగా పూర్తిచేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషేంటును రక్షించి చరిత్ర సృష్టించారు. అత్యంత అరుదైన ఈ కేసు గురించి అను ఇనిస్టిట్యూట్ వాస్క్యులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ భవానీ శంకర్ మీడియాకు వివరించారు. ఎనికేపాడులోని అను ఇనిస్టిట్యూట్లో శనివారం జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామానికి చెందిన గంగుల వీరాస్వామి (59) తీవ్ర అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. గుండె నుంచి మెదడుతో సహా పలు ప్రధాన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే పెద్ద ధమని చిట్లిపోవడంతో పేషేంటుకు ప్రాణాపాయస్థితి ఏర్పడింది. తీవ్రమైన రక్తపోటు కారణంగా ఈ పరిస్థితి తలెత్తగా.. వెంటనే చికిత్స చేసి పెద్ద ధమనికి స్టెంట్ వేయకపోతే ఏ క్షణంలోనైనా పేషేంట్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం వుంది. అయితే, పెద్ద ధమనికి స్టెంట్ అమర్చేముందు మెదడు తదితర కీలక భాగాలకు రక్త సరఫరా నిలిచిపోకుండా చూడాల్సివుంటుంది. తొలుత మందుల ద్వారా రక్తపోటును నియంత్రించి, శస్త్రచికిత్సను ప్రారంభించాం. మెదడు కుడిభాగానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం నుంచి మెదడు ఎడమ భాగానికి వెళ్లే రక్తనాళాన్ని అనుసంధానించి, అక్కడి నుంచి ఎడమ చేతి రక్తనాళానికి రక్తసరఫరాను పునరుద్ధరించగలిగాం. అత్యంత క్లిష్టమైన ఈ ప్రక్రియ అనంతరం, చిట్లిపోయిన ఛాతీ భాగంలోని పెద్ద ధమనికి గ్రాఫ్ట్ చేసి పేషేంట్ ప్రాణాలను కాపాడగలిగాం’ అని తెలిపారు. అయోటిక్ డిసక్షన్ అనే ప్రాణాంతక సమస్యకు అత్యంత అరుదైన, అతి క్లిష్టమైన ‘అయోటిక్ స్టెంట్ గ్రాఫ్టింగ్ (టీవర్) విత్ రైట్ కరోటిడ్ టు లెఫ్ట్ కరోటిడ్ అండ్ లెఫ్ట్ కరోటిడ్ టు లెఫ్ట్ సబ్ క్లావియన్ ఆర్టరీ బైపాస్’ చికిత్సను విజయవంతంగా పూర్తిచేయగలిగామని వివరించారు. అను ఇనిస్టిట్యూట్ వాస్క్యులర్ విభాగం, కార్డియో అనస్థీషియన్ డాక్టర్ కె. వంశీకృష్ణ, అనస్థీషియా టీమ్, కాథ్ ల్యాబ్ సిబ్బంది, నర్సింగ్ బృందం సహకారంతో, దాదాపు ఆరుగంటల పాటు సుదీర్ఘంగా సాగిన అత్యంత అరుదైన చికిత్సా ప్రక్రియను విజయంతంగా నిర్వహించగలిగామని అన్నారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ జి. రమేష్, హాస్పిటల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ తరహా కేసుల్లో పేషేంట్ ప్రాణాలకు ఏ క్షణమైనా ముప్పు ఏర్పడొచ్చని, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు, గతంలో హృద్రోగ చికిత్సలు చేయించుకున్నవారు తరచుగా అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యాధునిక సాంకేతికత సదుపాయాలు, అపార అనుభవజ్ఞులైన వైద్య నిపుణులతో నిర్వహించబడుతున్న అను ఇనిస్టిట్యూట్ కార్డియాలజీ విభాగం ద్వారా ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో చికిత్సలను అందిస్తున్నామని డాక్టర్ భవానీ శంకర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీదేవి, అను ఇనిస్టిట్యూట్ వైద్య నిపుణులు డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *