-నగరపాలక కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, పోలీస్ కమీషనర్ క్రాంతి రాణా టాటా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రోజు నగర కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, నగర పోలీస్ కమీషనర్ శ్రీ క్రాంతి రాణా టాటా ఐ.పి.ఎస్, భవానిఘాట్, దుర్గ ఘాట్, పున్నమి ఘాట్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంచిన వసతులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. సోమవారం కార్తీకపౌర్ణమి సందర్భంగా వచ్చు భక్తులకు జల్లు స్నానల వద్ద ఏవిధమైన ఇబ్బందులు కలుగుకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఘాట్ల యందు మెరుగైన పారిశుధ్య పరిస్థితులను నెలకొల్పి ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఘాట్ ల వద్ద భక్తులను నది లోపలకి వెళ్ళకుండా నది లోపల ఏర్పాటు చేసిన ఇనుప మెస్ లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసినారు. ఘాట్ లు వద్ద నిరంతరం సిబ్బంది విధులలో ఉంచి పరిసరాలు అన్నియు ఎప్పటికప్పడు పరిశుభ్ర పరచే విధంగా చర్యలు చేపట్టాలని మరియు భక్తులు ఎవరు వ్యర్ధములు లేదా వారు వేసుకోనిన బట్టలు నదిలో పడవేయకుండా చూడాలని ఘట్ ఇన్ ఛార్జ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో పోలీసు సిబ్బంది, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణ మూర్తి, హెల్త్ ఆఫీసర్లు, డా.సురేష్ బాబు, డా.ఇక్బాల్ హుస్సేన్ శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News