Breaking News

గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చట్టవేతిరేకంగా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కానింగ్‌ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని, గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు చట్టవేతిరేకంగా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వైద్యాధికారులను ఆదేశించారు.
లింగ నిర్థారణ పరీక్షల నిషేదిత చట్టం అమలు పై జిల్లా స్థాయి మల్టీమెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ అడ్వజరీ కమిటి సమావేశం శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా నేరంగా పరిగణించి ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్య క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా వుండాలన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో స్త్రీ పురుష నిప్పత్తి ప్రతీ 1000 మంది పురుషులకు 959గా నమోదై ఉందన్నారు. జిల్లాలో 249 రిజిస్ట్రరైన స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయన్నారు. స్కానింగ్‌, ఇమేజింగ్‌ సెంటర్ల అనుమతులకు ప్రభుత్వం నిర్థేశించిన నియమ నిబంధనలను పాటించాలన్నారు. అన్‌లైన్‌ ద్వారా కొత్తగా రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్‌, మాడిఫికేషన్‌లకు సమర్పించే అన్ని డాక్యూమెంట్లను పరిశీలించాలన్నారు. అనుమతుల విషయంలో జారీ చేసే పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. చెక్‌ లిస్ట్‌ను తయారు చేసుకుని సమర్పించిన ధరఖాస్తులను సరిచూసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో ను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రిజిష్టర్లను తనిఖీ చేయాలన్నారు. ప్రతి నెల సమావేశాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.
జిల్లా స్థాయి మల్టీమెంబర్‌ అప్రోప్రియేట్‌ అథారిటీ అడ్వజరీ కమిటి సభ్యులు మెట్రోపాలిటిన్‌ సెషన్స్‌ జడ్జి, ఎసిబి జడ్జి జస్టీస్‌ వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి మాట్లాడుతూ ప్రస్తుతం నిర్వహిస్తున్న స్కానింగ్‌ సెంటర్ల రెన్యూవల్‌, కొత్తగా రిజిస్ట్రేషన్లు, స్కానింగ్‌ కేంద్రాలలో మాడిఫికేషన్లకు ధరఖాస్తు చేసుకున్న అన్‌లైన్‌ ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులను మంజూరు చేయాలన్నారు. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అనుమతుల మంజూరు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి మంజూరు చేయాలన్నారు.
కొత్త రిజిస్ట్రేషన్లకు సంబంధించి మూడు కేంద్రాలకు, రెన్యూవల్‌కు సంబంధించి నాలుగు కేంద్రాలకు అనుమతులను కమీటి అమోధించింది. ప్రస్తుతం కేంద్రాల చిరునామ, ఉద్యోగుల, పరికరాల మార్పులు చెర్పులకు సంబంధించి వచ్చిన ధరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి సమావేశంలో అనుమతులు మంజూరు చేసేలా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సమావేశంలో అడిషనల్‌ సిపి పి. వెంకటరత్నం, డియంహెచ్‌వో డా. యం సుహసిని, డిప్యూటి డియంహెచ్‌వో డా. వై నళిని దేవి, డిస్టిక్‌ టిబి ఆఫీసర్‌ ఎస్‌ పద్మావతి, వాసవ్య మహిళ మండలి సెక్రటరి జి. రేష్మి, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *