Breaking News

పవర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులో రైతులకు ఎటువంటి నష్టం లేకుండా సంతృప్తి చెందే విధంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది…

-నేషనల్‌ హైవేకు సర్వీస్‌ రోడ్డును ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తాం…
-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పవర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు స్థల సేకరణలో భాగంగా విజయవాడ రూరల్‌ మండలం కుందావారి కండ్రిక గ్రామ రైతులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌లతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కొరకు నిర్మించే పవర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు రైతులు సహకరించాలని కోరారు. రైతుల పొలాలు మీదుగా పవర్‌ తీగలు, పోల్స్‌ వేసే భూములు సేకరణలో నష్టం లేకుండా ప్రస్తుత పంట నష్టంతో పాటు భూమికి సంతృప్తి కరమైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ఆయా సర్వే నంబర్ల ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం చెల్లించే ధరలో ఏ ఒక్కరికి నష్టం జరగదన్నారు. దీనిపై రైతులు తమ అభిప్రాయాలు అభ్యంతరాలలు సమస్యలు ఉన్నట్లయితే రైతులు గ్రామంలో సమావేశం నిర్వహించుకుని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో నేషనల్‌హైవేకి సంబంధించిన పనుల్లో గ్రామం నష్టపోయిందని నేషనల్‌ హైవేకు సర్వీస్‌రోడ్‌ ఏర్పాటు చేయాలని రైతులు జాయింట్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకురాగా గ్రామాన్ని సందర్శించి సర్వీస్‌ రోడ్డు ఏర్పాటు పై పరిశీలిస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు.
సమావేశంలో రూరల్‌ తహాశీల్థార్‌ శ్రీనివాస్‌నాయక్‌, లాంకో, నేషనల్‌ హైవే ప్రతినిధులు జగన్‌మోహన్‌రావు, లత, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్కో ప్రతినిధులు, రైతులు బీమిరెడ్డి రామకోటిరెడ్డి, ఎన్‌ రవీంద్రరెడ్డి, ఔతు సామిరెడ్డి, కొల్లి దశరథరామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *