Breaking News

వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ అన్నారు. జిల్లాలో చేపట్టిన సాధారణ జాతీయ రహదారి భూ సేకరణ పనులు పని తీరుపై శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నందు జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పెండిరగ్లో ఉన్న భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గొల్లపూడి రైల్వే లైన్‌ సంబంధించి ప్లానింగ్‌ నోటిఫికేషన్‌ సకాలంలో పంపాలని సబ్‌ కలెక్టర అదితి సింగ్‌ను ఆదేశించారు. జక్కపూడి ఫ్లైఓవర్‌ పనులలో భాగంగా 93 సెంట్ల భూమికి అవార్డు పాస్‌ అయిందని మిగిలిన 87 సెంట్ల భూమికి సంబంధించి జాయింట్‌ ఇన్‌స్పెషన్‌ రిపోర్టును పంపాలని సబ్‌ కలెక్టర్‌కు సూచించారు. జి కొండూరు మండలం చెరువుమాధవవరం, తెల్లకీసరపాడు, గంగినేనిపాలెం, దుగిరాలపాడు రైల్వే పాజెక్టులో అవార్డు పాస్‌ అయిందని తదుపరి చర్యలు పై రికార్డులలో చూపాలన్నారు. గుణదల, విజయవాడ నార్త్‌ రైల్వే రెండవ లైన్‌ భూ సేకరణలో సబ్‌ కలెక్టర్‌ రిమార్కుల నివెదికను అందజేయలన్నారు. జగ్గయ్యపేట ముకైశ్వరపురంలో ఇన్‌లాండ్‌ వాటర్‌ వేవ్‌ సంబంధించి 7 ఎకరాల 50 సెంట్లకు అవార్డ్‌కు అమోదం ఇచ్చారని సంబంధిత నివేదికను పంపాలని అన్నారు. భవానిపురం ఎ`1 సర్వీస్‌ రోడ్డులో ఆర్‌అండ్‌ఆర్‌ స్కీమ్‌ ప్రతిపాదనలు వచ్చిన నివేదికను సర్క్యులేట్‌ చేయాలన్నారు. మైలవరం మండలం చంద్రాల ఆర్‌అండ్‌బి రోడ్డు అవార్డు పాస్‌ అనుమతుల కొరకు పంపాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో నందిగామ ఆర్‌డివో ఏ రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డివో వైవి లక్ష్మి ప్రసన్న, ఆయా మండలాల తహాశీల్థార్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *