Breaking News

పాఠశాల నిర్వహణ నిధులతో చేపట్టే పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల నిర్వహణ నిధులతో (స్కూల్‌ మెయింటినెన్స్‌ ఫండ్స్‌) మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు.
నగరంలోని పటమట కోనేరు బసవయ్య చౌదరి ఉన్నత పాఠశాలలో మంగళవారం 60 వేల రూపాలయల పాఠశాల నిర్వహణ నిధులతో చేపట్టిన పనులను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు పరిశీలించి నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్వహణను స్వయంగా పరిశీలించి తలుపులు, ట్యాప్‌లు, పగిలిన టైల్స్‌ నాణ్యత లోపాలు ఉన్నందున అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ నిధులతో లోపాలను సరిచేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోనే మోడల్‌ స్కూల్‌గా పేరు ఉన్న కోనేరు బసవయ్య చౌదరి ఉన్నత పాఠశాలలో నిర్వహణ ఈ విధంగా ఉంటే ఇతర పాఠశాలలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అని అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 341 ప్రభుత్వ పాఠశాలలోని మండల స్థాయిలో యంపిడివోలు, తహాశీల్థార్లు, విద్యాశాఖ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో చర్చించి ఆయా పాఠశాలలో అందుబాటులలో ఉన్న నిధులు, ఇప్పటివరకు ఖర్చు చేసినవి ఇంకనూ చేపట్టవలసిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని నివేధిక అందించేలా ఆదేశించామన్నారు.ఇకపై తాను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులను పరిశీలిస్తానన్నారు. ప్రతి పాఠశాలలోను పాఠశాల నిర్వహణ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చువలసి వుంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా మౌలికవసతులు కల్పించి అభివృద్ధి చేసే నాడు`నేడు పథకంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారన్నారు. కోట్లాది రూపాయల నిధులను విద్యకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పాఠశాలలో నాణ్యతతో ప్రధానంగా నీటి వసతితో మరుగుదొడ్లు వంటి వాటికి మౌలిక వసతులు కల్పించాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు ఉంటాయని అధికారులను కలెక్టర్‌ హెచ్చరించారు.

ఉపాధ్యాయునిగా పాఠాలు బోదించిన కలెక్టర్‌ :
జిల్లా పరిష్యత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలోని విద్యార్థులను తెలుగు, ఇంగ్లీషు, లెక్కలకు సంబంధించిన పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని తెలుగు పదాలను బోర్డు పై వ్రాయమని కలెక్టర్‌ విద్యార్థులను అడగగా వారు వ్రాసిన తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి చెందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలెక్టర్‌ మాట్లాడుతూ పాఠ్యాంశాలను చదివి అర్థం చేసుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. చదువుతో పాటు వ్రాయడం కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులలో ఉన్న భయాలను తొలగించి, విద్యార్థులకు అర్థమయ్యే రీతులో బోదన ఉండాలని ఉపాధ్యాయులకు కలెక్టర్‌ డిల్లీరావు సూచించారు.
పర్యటనలో కలెక్టర్‌ వెంట డిఇవో సివి రేణుక, పాఠశాల హెచ్‌యం కె.ఏ ప్రేమ్‌సాగర్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *