రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధిసంస్థ, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తూర్పుగోదావరిజిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “జాబ్ మేళా” లో భాగంగా, రాజమహేంద్రవరం రూరల్లోగల బొమ్మూరు నందు గల పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళ” జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిడి డిఆర్ డిఎ సుభషిని, జిల్లా ఉపాది కల్పనాదికారి కే. హరిశ్చంద్ర ప్రసాద్, జేడిఎం సుమలత మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి. పిడి డిఆర్ డిఎ సుభషిని మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఈ మేళా ఒక బంగారు అవకాశo సుమారు 12 కంపెనీలు పలుగొంటున్నాయి దాదాపు 950 వివిధ కపనిలలో పలు రకాల నియామకాలు ఉన్నాయి కావున, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినయోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ రాయల్ ఎన్ ఫీల్ద, క్వాస్ కార్ప్, ముతూట్ ఫైనాన్స్,డెక్కన్ ఫైన్ కెమికల్స్, అపోలో ఫార్మసీ, హెల్ప్ యువర్ నీడ్స్, బిగ్ సి, బి న్యూ మొబైల్స్, రిలయన్స్ రిటైల్స్,మోహన్ స్పీన్ టెక్స్, శ్రీ రామ్ లైఫ్ మారియు మెడ్ ప్లస్ కంపనీలు పాలుగొన్నాయీ. తూర్పు గోదావరి జిల్ల పరిసరప్రాంతల నుండి సూమరు 195 నిరుద్యోగ యువత పాల్గొనగా 95 సెలెక్టెకాగా మరో 20 తదుపరి దశకు ఎంపిక చేయడం జరిగింది . యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధిసంస్థ, జిల్లా ఉపాది కార్యాలయం మరియు సీడాప్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యా మంత్రి గౌ.శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రా వ్యాప్తంగా నిరుద్యోగ యువత కొరకు ప్రత్యేక జాబ్ మేళా ప్రణాళిక సిద్దం చేశారని, రాబోవు రోజుల్లో మరిన్ని అవకాశాలను కల్పించడమే ముఖ్యమంత్రి గారి ద్యేయం అని జే.డి . ఎం సుమలత తెలిపారు. ఈ కార్య క్రమానికి పిడి డిఆర్ డిఎ సుభషిని, జిల్లా ఉపాది కల్పనాదికారి కే. హరిశ్చంద్ర ప్రసాద్, జేడిఎం సుమలత, ఎడి నాక్ రఘునాధబాబు,అదనపు జిల్లా నైపుణ్యాదికారి పెరుమాళ్రావు, ప్లేస్ మెంట్ ఎక్ష్కుటివ్ రాజ్ కుమార్ మరియు గారు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News