Breaking News

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి, అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది…

-రాష్ట్ర హోమ్ మంత్రి, డా. తానేటి వనిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి గ్రామ వాలంటీర్ వ్యవస్థ ను గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి అర్హులందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వనిత అన్నారు.

గురువారం కొవ్వూరు 17 వ వార్డులో ” గడప గడపకు మన ప్రభుత్వం” కార్య క్రమంలో మంత్రి వనిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా అందించిన ఘనత వై.యస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. నాయకులు, అధికారులు, సచివాలయాల ఉద్యోగులు వాలంటరీ లతో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల వలన కలిగిన లబ్దిని వివరించి, ప్రజలు సమస్యలు తెలుసుకుని అక్కడ కక్కడే సమస్యలు పరిష్కరించడానికి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించి కష్టకాలంలో వారిని ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కరించ డానికి ప్రత్యేక దృష్టి సారిచిం దన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ, జగనన్న ప్రభుత్వం నామినేటడ్ పదవు ల్లో 50 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పించడం జరిగిందని మంత్రి అన్నారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలవాలని, అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను అందచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని వనిత పేర్కొన్నారు. మంత్రి ఇంటింటికి వెళ్లి గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పధ కాలు వివరించారు. స్థానిక సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరా మకృష్ణ, వ్యవసాయ మార్కె టింగ్ కమిటీ చైర్మన్ వల్లభ శెట్టి గంగాధర శ్రీనివాస్, కొవ్వూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్లు మన్నే పద్మ, గండ్రోతు అంజలీ దేవీ, కొవ్వూరు తాహసీల్దార్ బి. నాగరాజు నాయక్, మునిసిపల్ కమీషనర్ బి. శ్రీకాంత్, స్థానిక నాయకులు రుత్తల భాస్కరరావు, కౌన్సిలర్లు అక్షయ పాత్ర శ్రీనివాస రవీంద్ర, పతివాడ నాగమణి, అంకోలు లిల్లీ వెంకట పద్మలీల, తోట లక్ష్మీ ప్రసన్న, మద్దిపట్ల సాయిగీత, వరిగేటి లలితా కుమారి, గుర్రె శరత్, పతివాడ రామారావు తదితర నాయకులు కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *