Breaking News

భూ హక్కు పెండిరగ్‌ పత్రాలను త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న శాశ్వత భూ హక్కు పెండిరగ్‌ పత్రాలను త్వరితగతిన పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, సర్వే అధికారులతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స కమీషనర్‌ సిద్దార్థ జైన్‌, వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.
నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో జిల్లాలోని 14 గ్రామాలలో భూముల రీసర్వే పనులు పూర్తి చేసి భూ హక్కు పత్రాల పంపిణీ ప్రారంభించామన్నారు. సర్వే పూర్తి అయిన గ్రామాలలో రెవెన్యూ రికార్డులలోని వివరాలను క్షేత్రస్థాయి సర్వే వివరాలతో సరి చూసి ఇప్పటికే 4 వేలకు పైగా భూ హక్కు పత్రాలను పంపిణీ చేశామన్నారు. వివిధ కారణాలతో పెండిరగ్‌లో ఉన్న పత్రాలను రెండు రోజులలో పంపిణీకి చర్యలు తీసకుంటున్నామన్నారు. భవిష్యత్‌లో భూ యజమానులకు ఎటువంటి ఇబ్బందులు, వివాధాలకు తావులేకుండా భూ హక్కు పత్రాలను రికార్డులతో ఒకటికి రెండు సార్లు పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే తొలి సారిగా మన రాష్ట్రంలో డ్రోన్‌ టెక్నాలజి ఉపయోగించి అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను సచ్చీకరణ, వాస్తవంగా భూమి విస్తీర్ణం అధారంగా రికార్డులను తయారు చేయడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు సిసిఎల్‌కు వివరించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికాడ్స్‌ ఆఫీసర్‌ కె. సూర్యారావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *