Breaking News

భీమవరంలో నూతనంగా నిర్మించిన రోడ్డు అండర్ బ్రిడ్జి ని ప్రారంభించిన కేంద్ర విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్


-విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో ప్రస్తుత సంవత్సరంలో 11 మానవ చాలిత గేట్లను తొలగించి వంతెన కిందగా వెళ్ళే 24 మార్గాలను నిర్మించారు

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విదేశాంగ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో లెవెల్ క్రాసింగ్ 115కి బదులుగా కొత్తగా నిర్మించిన రోడ్డు అండర్ బ్రిడ్జి (RuB) – 231ని శనివారం ప్రారంభించారు. భీమవరంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్, ఇతర విజయవాడ డివిజన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

రైల్ వికాస్ నిగం లిమిటెడ్ అధికారులు రూ.22 కోట్లతో వంతెన కిందగా వెళ్ళే ఈ రోడ్ మార్గాన్ని నిర్మించారు. భీమవరంలోని రద్దీగా ఉండే వాణిజ్య వీధుల్లో ట్రాఫిక్ రద్దీని నివారించడం ద్వారా రోజువారీ ప్రయాణికులకు ఇది పెద్ద ఉపశమనాన్ని అందిస్తుంది. దీంతో విజయవాడ డివిజన్ ప్రస్తుత సంవత్సరంలో 11 మానవ సహిత లెవల్ క్రాసింగ్‌లను తొలగించి 24 బ్రిడ్జి కింద రోడ్లను నిర్మించింది.

కేంద్ర విదేశాంగ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి వి. మురళీధరన్ విశిష్ట అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ సహాయ మంత్రి వి. మురళీధరన్ సబ్ కా సాత్-సబ్ కా వికాస్ సూత్రంతో దేశం ముందడుగు వేస్తోందని, సమగ్రాభివృద్ధి, సమ్మిళిత అభివృద్ధిని సులభతరం చేయడం ద్వారా నరేంద్ర మోదీ జీ నాయకత్వంలో సహకార సమాఖ్య నిజమైన స్ఫూర్తితో దేశనిర్మాణం జరుగుతుందని అన్నారు. భీమవరం పరిసర, పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అండర్ బ్రిడ్జి రోడ్డు మార్గం-231, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంతోపాటు నగరాన్ని 16, 216 నెంబరు జాతీయ రహదారులులతో అనుసంధానించడం ఈ ప్రాంత ప్రజలకు పెద్ద వరం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పారే కాలువకు ఆనుకుని ఆర్ యు బి 231వ నెంబరు నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు 7 నెలల రికార్డు సమయంలోనే నిర్మాణాన్ని పూర్తి చేసినందుకు విజయవాడ డివిజన్ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. రైల్వే శాఖ భీమవరంలోని మరో 4 రోడ్ అండర్ బ్రిడ్జ్ లతో పాటు, 100% విద్యుదీకరణ, బ్రాంచ్ లైన్ డబ్లింగ్‌ పనులు పూర్తి చేసిందని, ఆధునిక టిక్కెట్ కౌంటర్లు, కొత్త స్టేషన్ భవనాలు, మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలతో బ్రాంచ్ లైన్ స్టేషన్‌లను పునరాభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. అన్ని ముఖ్యమైన నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేస్తోందని, రాష్ట్రాలకు మౌలిక సదుపాయాల కేటాయింపులను అనూహ్యంగా పెంచిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి, దృఢ సంకల్పంతో పని చేస్తుందన్నారు.

నగరంలో ఈ రోడ్ అండర్ బ్రిడ్జి తోపాటుగా మరో 4 నిర్మించడం ద్వారా భీమవరం రోజువారీ ప్రయాణీకులకు పెద్ద సహాయాన్ని అందించినందుకు కేంద్ర మంత్రికి, కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్ నర్సింహారావు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేస్తున్నందుకు కేంద్రానికి, రైల్వే మంత్రికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

విజయవాడ డివిజన్- డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర కుమార్, మంత్రి వి.మురళీధరన్ కీ, ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసిన విశిష్ట అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ మాట్లాడుతూ డివిజన్‌లో కీలక ప్రాంతాల్లో ఉన్న లెవెల్‌ క్రాసింగ్‌లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నట్లు తెలిపారు. డివిజన్‌లో లెవెల్ క్రాసింగ్‌లను తొలగించడం వల్ల రైలు సెక్షనల్ వేగాన్ని కొనసాగించడంతోపాటు ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గుతుందని తెలిపారు.

శాసన మండలి చైర్మన్,  కె మోషేన్ రాజు, రాజ్యసభ సభ్యులు జి.వి. ఎల్.నరసింహారావు, బీజేపీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు,  సోము వీర్రాజు, పశ్చిమగోదావరి ఇన్‌చార్జి కలెక్టర్ జె.వెంకట మురళి, సీనియర్ డీసీఎం వి.రాంబాబు, డివిజినల్ ఇంజనీర్ -ఈస్ట్ కె. శ్రీధర్, సహాయ డివిజినల్ ఇంజనీర్ ఎ. శంకర్, పౌర సంబంధాల అధికారిణి నస్రత్ ఎం మంద్రుపకర్, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ వి. రవివర్మ, ఇతర విభాగాల రైల్వే అధికారులు, సిబ్బంది ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *