Breaking News

ఎన్ఆర్ఐ టిడిపి ఆధ్వర్యంలో 13 మంది యువతకు అమెరికాలో ఉద్యోగాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో 13 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. సమాచారం ప్రకారం హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ఉత్తీర్ణులైన 13 మంది విద్యార్థులకు అమెరికాలోని వివిధ అంతర్జాతీయ స్థాయి హోటలలో ఉద్యోగం లభించింది. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం గత కొంతకాలంగా ఉపాధ్యాయులు, ఎంబిఎ, ఇంజనీరింగ్, ఇతర టెక్నికల్ కోర్సులలో విద్యార్థులకు ఉచితంగా, జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్ మరియు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో బాగంగా మొదటిగా 13 మంది హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. సోమవారం ఇక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హెచ్ఆర్డి విభాగం చైర్మన్ రామాంజనేయులు తో పాటు ఎన్నారై విభాగం ఇన్చార్జి డాక్టర్ వేమూరు రవికుమార్ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను అభినందించారు. వారికి ఉద్యోగ నియామక నిమిత్తం లభించిన ఆఫర్ లెటర్లను అందజేశారు. అదేవిధంగా వారికి విదేశాల్లో ఉద్యోగ నిమిత్తం అవసరమైన సూచనలను సలహాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలు, ఆదేశాల ప్రకారం హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు లభించింది అని చెప్పారు.. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులకు అమెరికాతో పాటు అనేక దేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *