Breaking News

టిడిపి నేతలు బురదజల్లే ప్రయత్నం చేయటం సరికాదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ పాలను చూసి టిడిపి నేతలు బురదజల్లే ప్రయత్నం చేయటం సరికాదని ఏపీ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. విజయవాడ 28వ. డివిజన్ 202 వార్డు సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం బుధవారం కొనసాగింది. విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, 28వ డివిజన్ కోఆర్డినేటర్ కనపర్తి కొండ, అధికారులతో కలిసి భాను నగర్ కేంద్రీయ విద్యాలయం వద్ద నుండి ఎమ్మెల్యే పాదయాత్ర ప్రారంభించారు. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ గడపగడపను ఎమ్మెల్యే విష్ణు సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, పెన్షన్ గురించి మాట్లాడే అర్హత బోండా ఉమా, చంద్రబాబుకు లేదని, గత టిడిపి ప్రభుత్వంలో విజయవాడ సెంట్రల్ నియోజకవవర్గం అవినీతి మయమైందన్నారు. చంద్రబాబు, బోండా ఉమాను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉండగా సెంటర్ నియోజకవర్గంలో 16,000 పెన్షన్లు ఉన్నాయని, మా ప్రభుత్వంలో 9000 పెన్షన్లు పెంచి మొత్తం గాను 26,000 పెన్షన్ లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ కు ప్రజాధరణ చూసి చంద్రబాబు, బోండా ఉమా కావాలనే పెన్షన్లపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లు ఎక్కడ తొలగించట్లేదని సామాజిక తనిఖీలు చేస్తున్నామని మరోమారు గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు పెన్షన్లు అందిస్తున్నామని, చంద్రబాబు దొంగ హామీలతో ప్రజల్ని మోసగిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ మానవి కోణంలో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారని, ఇది పేదల ప్రభుత్వం… సంక్షేమ రాజ్యం అని తెలిపారు. సంక్షేమం విషయంలో టిడిపి, బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు సీఎం జగన్ ను ఎదుర్కొనే సత్తా లేదని, టిడిపి నేతలు ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడే ఉరవెల్లి లాంటివారని విమర్శించారు. చంద్రబాబుకు అధికారం పోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శ్రీలంక లాగా మారుతుందని మాట్లాడిన ఆయన ఇప్పుడు కర్నూలు వెళ్లి సీఎం జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని ఏడుస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు నెత్తి మీద ఉన్నాయని, టిడిపి అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు సీఎం జగన్ నవశకనికి నాంది వేశారని, 2024 లో వైఎస్ఆర్సిపికి ప్రజలు అండగా ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజన, డివిజన్ కోఆర్డినేటర్ కనపర్తి కొండ రెవిన్యూ, మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *