Breaking News

గృహనిర్మాణాలు, నాడు`నేడు పనులలో వారం వారి లక్ష్యాలను సాధించండి..

-స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించండి..
-పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయండి..
-కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
వారం వారిగా అధికారులకు నిర్థేశించిన లక్ష్యాలను పూర్తి చేసి పనుల ప్రగతిని చూపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
జిల్లా స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కలెక్టరేట్‌ నుండి బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మండల స్థాయి టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సమీక్షలో జాయింట్‌కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, తహశీల్థార్లు, పంచాయతీరాజ్‌. హౌసింగ్‌ ఇఇలు, డిఇలు, ఏఇలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలను చేపట్టిందన్నారు. స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాలో 12,264 గృహ నిర్మాణాలను పూర్తి చేసే లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. వీటిలో ఇప్పటికే 6,662కు పైగా గృహలను పూర్తి చేశామన్నారు. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు. వీటిలో రూప్‌ కాస్టింగ్‌ స్థాయి నుండి తుది దశలో ఉన్న సుమారు మూడు వేల గృహలను, రూప్‌ లెవల్‌ నుండి రూప్‌ కాస్టింగ్‌ వరకు ఉన్న మరో 2 వేల గృహలను రూప్‌ కాస్టింగ్‌ స్థాయికి తీసుకురావాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి నిర్థేశించిన గడువులోగా పూర్తి చేయాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. దశల వారి పనులకు సంబంధించి ఎప్పటికప్పడు అప్‌లోడ్‌ చేసిన వెంటనే ఏ స్థాయిలోను పెండిరగ్‌ లేకుండా బిల్లులు చెల్లింపు జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పాఠశాలలో నాడు`నేడు కార్యక్రమం ద్వారా అందనపు తరగతి గదులు, కాంపౌడ్‌ వాల్స్‌, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలను వివిధ దశలలో చేపట్టిందన్నారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి అయ్యాయని, ప్రస్తుతం జరుగుతున్న రెండవ దశ పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొదటి దశలో జిల్లాలో 341 పాఠశాలలో 8.11 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి చేశామన్నారు. ఇదే స్పూర్తిని రెండవ దశలోను కొనసాగించాలని కలెక్టర్‌ అధికారులను కోరారు. రెండవ దశలో 431 పాఠశాలల అభివృద్ధికి 185.12 కోట్లు మంజూరు అయ్యాయని వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా 59 పాఠశాలలో చేపట్టిన 368 అదనపు తరగతి గదులు నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. నిధులకు ఎటువంటి కొరత లేదని కలెక్టర్‌ అన్నారు. రెండవ దశలో 96 ఉన్నత పాఠశాలలు 69 ప్రాధమికోన్నత 266 ప్రాధమిక పాఠశాలలో మరమ్మతులు చేపట్టడం, త్రాగునీరు సౌకర్యం కల్పించడం, మధ్యాహ్నం భోజనానికి ప్రత్యేక షెడ్లు, మరుగుదొడ్ల నిర్మాణాలు తదితర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలన్నారు.
స్పందన అర్జీల పరిష్కారం పై ఎప్పటికప్పుడు అధికారులు స్పందించాలన్నారు. స్పందనలో నమోదు అవుతున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గడువులోగా పరిష్కరించాల్సిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గడువు తీరిన అర్జీలు పెండిరగ్‌ ఉండరాదన్నారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చేందేలా పరిష్కరించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
టెలికాన్ఫరెన్స్‌లో జాయింట్‌కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, నందిగామ ఆర్‌డివో ఏ రవీంద్రరావు, తిరువూరు ఆర్‌డివో వైవి ప్రసన్న లక్ష్మి, హౌసింగ్‌ పిడి శ్రీదేవి, డిఇవో సివి రేణుక తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *