Breaking News

ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మరియు మాజీ శాసన సభ్యులు షేక్ మస్తాన్ వలి ముఖ్య అతిధిగా పాల్గొని పతాకావిష్కరణ చేసి స్వాతంత్య్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి గారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ కుల మతాలకు అతీతంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్వాతంత్య్ర సాధనలో కాంగ్రెస్ నాయకుల కృషి అనిర్వచనీయమని, బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి దేశానికీ స్వాతంత్రాన్ని సాధించారని తెలిపారు. నేటి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుల, మతాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని, భారత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాయని, ప్రపంచ దేశాల ముందు భారత దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని అన్నారు. శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య సమానత్వాన్ని, ప్రేమ భావాన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహ రావు, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, ఎపిసిసి ఆర్టీఐ సెల్ చైర్మన్ పి.వై.కిరణ్, కొలనుకొండ శివాజీ, మేడా సురేష్, కొమ్మినేని సురేష్, యూత్‌ కాంగ్రెస్‌ లీడర్‌ అల్లం రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *